టీసీల కోసం విద్యార్థినుల ఆందోళన

ABN , First Publish Date - 2020-11-14T05:21:06+05:30 IST

పట్టణంలోని ఓ జూనియర్‌ కళాశాల వద్ద టీసీల కోసం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు, తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.

టీసీల కోసం విద్యార్థినుల ఆందోళన

డోన్‌(రూరల్‌), నవంబరు 13: పట్టణంలోని ఓ జూనియర్‌ కళాశాల వద్ద టీసీల కోసం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు, తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. తమ ప్రతిభను గుర్తించి మొదటి సంవత్సరంలో ఉచిత విద్యాబోధన అంగీకరించిన యాజమాన్యం ఇప్పుడు ఫీజులు చెల్లిస్తేనే టీసీ లు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. ఆందోళనను విరమించాలని పట్టణ పోలీసులు విద్యార్థినులు, తల్లిదండ్రులకు సర్దిచెప్పారు. కళాశాల యజమాన్యం ఒకరోజు గడువు అడగడంతో వారు సీఐ సుబ్రహ్మణ్యంకు తమ సమస్యను విన్నవించారు. 

Updated Date - 2020-11-14T05:21:06+05:30 IST