రిజర్వాయర్‌లో విద్యార్థి గల్లంతు

ABN , First Publish Date - 2020-12-07T05:15:17+05:30 IST

అవుకు రిజర్వాయర్‌లో ఇల్లూరి ప్రసన్నకుమార్‌ అనే విద్యార్థి గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

రిజర్వాయర్‌లో విద్యార్థి గల్లంతు

అవుకు, డిసెంబరు 6: అవుకు రిజర్వాయర్‌లో ఇల్లూరి ప్రసన్నకుమార్‌ అనే విద్యార్థి గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ప్రసన్నకుమార్‌ స్వగ్రామం కొలిమిగుండ్ల. అనంతపురంలోని విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ బైపీసీ చదువుతున్నాడు. తండ్రి ఇల్లూరి బుగ్గ రాముడు సొంత పని నిమిత్తం గుళ్లదుత్తికి వెళ్లాడు. పెద్ద కుమారుడైన ప్రసన్నకుమార్‌ స్నేహితులతో కలసి అవుకు రిజర్వాయర్‌ వద్దకు చేరుకొని ఈతకు దిగారు. ప్రమాదశాత్తు ప్రసన్నకుమార్‌ గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. 

Read more