-
-
Home » Andhra Pradesh » Kurnool » strike jayapradam chayandi
-
‘సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి’
ABN , First Publish Date - 2020-11-25T06:13:59+05:30 IST
ఈ నెల 26న జరిగే దేశవ్యాస్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

కర్నూలు(న్యూసిటీ), నవంబరు 24: ఈ నెల 26న జరిగే దేశవ్యాస్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాలతో ఎల్‌ఐసీ యూనియన్ రీజినల్ కార్యదర్శి సునీయకుమార్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏఐబీఈఏ జిల్లా నాయకులు నాగరాజు, బీఎ్‌సఎన్‌ఎల్ నాయకులు వెంకటరామిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప హాజరయ్యారు.
సమ్మెకు విద్యార్థి సంఘాల మద్దతు
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఎస్‌ఎ్‌ఫఐ,పీడీఎ్‌సయూ, ఏఐఎ్‌సఎఫ్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి ప్రకా్‌ష, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి భాస్కర్ తెలిపారు. మంగళవారం సుందరయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
కర్నూలు(ఎడ్యుకేషన్):
సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. మంగళవారం కర్నూలు నగరంలోని సుందరయ్య భవన్‌లో ఎస్‌ఎ్‌ఫఐ, పీడీఎ్‌సయూ, ఏఐఎ్‌సఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్, భాస్కర్, శరత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్య, ఉపాధి కల్పనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ప్యాపిలి:
సార్వత్రిక సమ్మెకు యూటీఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు నాయకులు నరసింహారెడ్డి, శ్రీధర్ రాజు తెలిపారు. మంగళ వారం స్థానిక బాలుర హైస్కూలులో వారు విలేకర్లతో మాట్లాడారు.
పత్తికొండ టౌన్:
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్‌లో మోటర్‌బైక్ ర్యాలీని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు కృష్ణ, సుల్తాన్, నెట్టికంటయ్య, ఎంకె, రామచంద్ర, వెంకటేశ్వరరెడ్డి, దస్తగిరి పాల్గొన్నారు.
ఆలూరు రూరల్:
నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు సైరన్ మోగించాయని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కేపీ నారాయణస్వామి, మండల కార్యదర్శి షాకీర్ అన్నారు. ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జ్యోతిబసు భవన్ నుంచి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మిగనూరు టౌన్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు బాలరాజు, అనీఫ్ కోరారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు బాబు, వలి, మునిస్వామి, నరసింహులు, సీపీఐ నాయకులు పంపన్నగౌడ్, సోమేశ్వరరెడ్డి, సత్యన్న పాల్గొన్నారు. అలాగే సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి రాజు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, పీడీఎ్‌సయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్రబాబు పిలుపునిచ్చారు.