పాఠశాల కూల్చివేతను అడ్డుకున్న కాలనీవాసులు
ABN , First Publish Date - 2020-12-14T05:19:46+05:30 IST
35 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాలను కూల్చివేస్తే చూస్తూ ఊరుకోమని రాయనగర్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదోని(అగ్రికల్చర్), డిసెంబరు 13: 35 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాలను కూల్చివేస్తే చూస్తూ ఊరుకోమని రాయనగర్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని రాయమిల్లు పాఠశాలను మిల్లు యాజమాన్యం కూల్చివేసేందుకు రావడంతో కాలనీవాసులు అడ్డుకున్నారు. ఎంతో మంది ఈ పాఠశాలలో చదవి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఇలాంటి పాఠశాలను కూల్చివేసి మా కాలనీవాసుల పిల్లలను చదువులకు దూరం చేయవదన్నారు. రాయలసమీలోనే మొదటి మిల్లు అయిన రాయల్ స్పిన్నింగ్ మిల్లును మూసివేసి తమను ఉపాధి లేక వీధినపడేశారన్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేందుకు పాఠశాలను కూడా కూల్చివేస్తున్నారన్నారు. పాఠశాల భవనాన్ని అలాగే ఉంచి చదువులు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు చిట్టిబాబు, శ్రీలక్ష్మి, ఈరన్న, దానం, అమృత్‌రాజు పాల్గొన్నారు.