ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు

ABN , First Publish Date - 2020-11-21T06:04:32+05:30 IST

సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో శుక్రవారం తుంగభద్ర పుష్కరాలను శాస్రోక్తంగా ప్రారంభ మయ్యాయి.

ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు
సంగమేశ్వరంలో ఉత్సవమూర్తులకు పుష్కర జలాలచే అభిషేకం

  1. సంగమేశ్వరంలో తొలిరోజు అంతంత మాత్రంగానే భక్తులు 
  2. పుష్కరాలు ప్రారంభమైనా  పూర్తికాని ఏర్పాట్లు 


ఆత్మకూరు/కొత్తపల్లి, నవంబరు 20: సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో శుక్రవారం తుంగభద్ర పుష్కరాలను శాస్రోక్తంగా ప్రారంభ మయ్యాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు ఆలయ ప్రధాన పురోహి తులు తెలకపల్లి రఘురామశర్మ లలితా సంగమేశ్వర స్వామి అమ్మవార్ల ప్రాచీన ఉత్సవమూర్తులతో పాటు గాయత్రీదేవి, గణపతి విగ్రహాలకు పుష్కరజలాలచే అభిషేకించారు. అలాగే నదీజలాలకు చీరసారె సమర్పించి గంగాహారతులను నివేదించారు. తదుపరి ఉమామహేశ్వరాలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ గావించి విశేషపూజలను జరిపారు. అదేవిధంగా తుంగభద్ర పుష్కరా లను పురస్కరించుకుని బృహస్పతి గాయత్రీ హోమాన్ని ప్రారంభిం చారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో తుంగభద్ర పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతించలేదు. భక్తులు తలపై నదీజ లాలను చల్లుకుకున్నారు. కొందరు భక్తులు స్నానాలను ఆచరించేం దుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంగమేశ్వరానికి తొలి రోజు భక్తుల తాకిడి సుమారు 300లోపే ఉంది. పుష్కరాలు ప్రారంభమైనా పనులు మాత్రం పూర్తి కాలేదు. రోడ్డు, విద్యుత్‌ సరఫరా పనులు, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పనులు కొనసాగాయి. తాగునీటి సదుపాయం ఎక్కడా కనిపిం చలేదు. సంగమేశ్వరం ఘాట్‌ ఇన్‌చార్జి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రమోహన్‌కు సీఎం పర్యటన విఽధుల బాధ్యలు అప్పగించడంలో ఆయన తొలిరోజు సంగమేశ్వరానికి రాలేదు. దీంతో పర్యవేక్షణ లేకుండా పోయింది. 


  సప్తనదీ సంగమ తీరంలోని తుంగభద్ర పుష్కరాలలో నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు ఈవో నాగప్రసాద్‌, పురోహి తులు తెలకపల్లి రఘురామ శర్మ పూర్ణకుంభ స్వాగతం పలికారు. పుష్కర ఘాట్‌ ఇన్‌చార్జి వెంగన్న, ఆత్మకూరు డీఎస్పీ శృతి, సీఐ కృష్ణయ్య, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఆయా శాఖల అధికారులు, వైసీపీ నాయకులు చెరకుచెర్ల రఘురామయ్య, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


  సంగమేశ్వర క్షేత్రంలో జరుగుతున్న తుంగభద్ర పుష్కర ఏర్పాట్లను ఆత్మకూరు డీఎస్పీ శృతి పరిశీలించారు. శుక్రవారం ఉదయం ఆమె సంగమేశ్వరంలోని ఎగువ పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కరాల్లో పోలీసు బందోబస్తు గురించి సీఐలు బీఆర్‌ కృష్ణయ్య, సుదర్శన ప్రసాద్‌లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎగువ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట ఎస్సైలు నవీన్‌బాబు, రాజ్‌కుమార్‌, చంద్రబాబు తదితరులు ఉన్నారు.


పిండప్రదానాలకు పురోహితులు కరువు 

  సప్తనదీ సంగమేశ్వరంలో తుంగభద్ర పుష్కరాలను పురస్కరిం చుకుని పిండప్రదానాల క్రతువులకు పురోహితులు కరువయ్యారు. సంగమేశ్వరంలో పిండప్రదానాలు జరిపేందుకు విజయవాడ ప్రాంతానికి చెందిన 15 మందిని నియమించారు. అయితే సదూర ప్రాంతం కావడం వల్ల ఎవరూ రాలేదు. సంగమేశ్వర క్షేత్ర పరిసర గ్రామాలకు చెందిన పురోహితులకు మంత్రాలయం, ఎమ్మిగనూరు, కర్నూలులోని వివిధ ఘాట్ల వద్దకు పిండప్రదానాలు జరిపేందుకు నియమించారు. కొందరు తమవెంట ప్రత్యేకంగా పురోహితులను తీసుకొచ్చి క్రతువులను జరిపించుకున్నారు. అయితే ఎట్టకేలకు సమ స్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్థానిక పురోహితులను పిండప్రదానాల క్రతువులను చేపట్టేందుకు నియమించుకోవాలని సూచించడంతో సంగమేశ్వర దేవస్థానం అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.

Read more