రంగస్థల నటుడు సంజన్న కన్నుమూత

ABN , First Publish Date - 2020-09-14T10:06:37+05:30 IST

జిల్లాలో సాంఘిక నాటకాలకు ఆద్యుడు, పలు నంది అవార్డులు అందుకున్న తొలితరం సాంఘిక నాటకాల దర్శకుడు సంజన్న (75) శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత హైదరాబాదులో కన్నుమూశారు.

రంగస్థల నటుడు సంజన్న కన్నుమూత

కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 13: జిల్లాలో సాంఘిక నాటకాలకు ఆద్యుడు, పలు నంది అవార్డులు అందుకున్న తొలితరం సాంఘిక నాటకాల దర్శకుడు సంజన్న (75) శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత హైదరాబాదులో కన్నుమూశారు. కర్నూలు నగరానికి చెందిన ఆయన బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేస్తూ పదవీవిరమణ చేశారు. ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రముఖ సినీ రచయిత దివాకర్‌బాబుకు ఆ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది సంజన్ననే. దివాకర్‌బాబు కర్నూలులో ఉద్యోగం చేస్తుండగా, ఆయన రాసిన పుటుక్కు జరజర డుబుక్కు మే అనే నాటికను నాటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఆడి, ఎన్నో బహుమతులు తీసుకువచ్చారు. అలాగే కుర్చీ అనే మరో నాటికతో ఆయన అనేక పరిషత్తులో గెలుపొందారు. రెండు నంది అవార్డులు లభించాయి. అలాగే ఓటున్న మనిషికి కోటి దండాలు, గప్‌చుప్‌ వంటి నాటికలు సంజన్నకు మంచి గుర్తింపు ఇచ్చాయి. 

Updated Date - 2020-09-14T10:06:37+05:30 IST