శ్రీశైలం ఆలయంలో పాముల సంచారం

ABN , First Publish Date - 2020-07-19T16:34:51+05:30 IST

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ప్రధాన ఆలయం చుట్టూ..

శ్రీశైలం ఆలయంలో పాముల సంచారం

కర్నూలు(ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ప్రధాన ఆలయం చుట్టూ పాములు సంచరిస్తున్నాయి. శనివారం ఉదయం విరాళాల కేంద్రం వద్ద ఒక నాగుపాము, మధ్యాహ్నం కృష్ణదేవరాయల గోపురం కంచి మఠం వెనుక ప్రాంతంలో సాధారణ జాతికి చెందిన పాము ఉన్నట్లుగా అక్కడి వారు దేవస్థానం అధికారులకు తెలిపారు.  ప్రత్యేక స్నేక్‌ క్యాచర్‌ రాజు అక్కడికి చేరుకొని సురక్షితంగా వీటిని పట్టుకున్నారు. సాయంత్రం మల్లికార్జున స్వామి ఆలయం వద్ద తిరుగుతున్న మరో నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు తెలిపారు. వర్షాలు కురవడం, భక్తుల సంచారం లేకపోవడం వల్లే పాములు జనావాసాల ప్రాంతాల్లోకి వస్తున్నట్లు స్నేక్‌ క్యాచర్‌ రాజు చెప్పారు. 


Updated Date - 2020-07-19T16:34:51+05:30 IST