దత్తాత్రేయ స్వామికి పూజలు
ABN , First Publish Date - 2020-12-04T05:06:51+05:30 IST
శ్రీశైలం మహక్షేత్రంలోని మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద ఉన్న దత్తాత్రేయ స్వామివారికి గురువారం లోకకల్యాణం కోసం విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది.

శ్రీశైలం, డిసెంబరు 3: శ్రీశైలం మహక్షేత్రంలోని మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద ఉన్న దత్తాత్రేయ స్వామివారికి గురువారం లోకకల్యాణం కోసం విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది. పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహా గణపతి పూజను చేశారు. అనంతరం దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు.