-
-
Home » Andhra Pradesh » Kurnool » Sreesailam Temple At VIP s
-
మల్లన్న సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2020-12-15T05:37:45+05:30 IST
భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సోమవారం వేర్వేరు సమయాల్లో రాష్ట్ర మంత్రులు సేవించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం. శంకరనారాయణ, విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

శ్రీశైలం, డిసెంబరు 14: భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సోమవారం వేర్వేరు సమయాల్లో రాష్ట్ర మంత్రులు సేవించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం. శంకరనారాయణ, విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈవో కేఎస్ రామరావు స్వాగతం పలికారు. దర్శనం అనం తరం భ్రమరాంబ దేవి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండ పంలో మంత్రులకు స్వామివార్ల శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
స్వామి సేవలో డిప్యూటీ స్పీకర్
భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సోమవారం రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఈవో కేఎస్ రామరావు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం భ్రమరాంబ దేవి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో కోన రఘుపతికి స్వామివార్ల శేష వస్త్రాలను ఇచ్చి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.