-
-
Home » Andhra Pradesh » Kurnool » Sreesailam News Kurnool District
-
దేవస్థానం సిబ్బందితో వైసీపీ నాయకుల వాగ్వాదం
ABN , First Publish Date - 2020-12-20T05:04:49+05:30 IST
శ్రీశైలం దేంస్థానం పరిధిలోని నంది సర్కిల్ వద్ద దుకాణాల అక్రమంగా విస్తరించుకుంటుండడంతో పనులను దేవస్థానం రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు.

- అక్రమ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో..
- 20 రోజుల తర్వాత బయటకొచ్చిన వీడియో
శ్రీశైలం, డిసెంబరు 19: శ్రీశైలం దేంస్థానం పరిధిలోని నంది సర్కిల్ వద్ద దుకాణాల అక్రమంగా విస్తరించుకుంటుండడంతో పనులను దేవస్థానం రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నాయకుల వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన 20 రోజుల క్రితం జరగగా శనివారం వీడియో బయటకు వచ్చింది. దేవస్థానం కేటాయించిన స్థలం కంటే ఎక్కువ స్థలాన్ని విస్తరణ చేయవద్దని షాపు నిర్వాహకున్ని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు. తమ దుకాణం ఒకటే కాదని ఆలయం వద్ద నుంచి చుట్టుపక్కల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించాలని వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ప్రతి దుకాణానికి దేవస్థానం కేటాయించిన కొలతలను సర్వే చేయించాలన్నారు. తమ దుకాణాలను అడ్డుకోవడాన్ని ఒప్పుకోబోమన్నారు. ఈ ఘటనపై శనివారం వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.