వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2020-12-21T05:28:09+05:30 IST

శ్రీశైల మహాక్షేత్రంలో లోక కళ్యాణం కోసం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకొని ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
శ్రీశైలంలో సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం

 శ్రీశైలం, డిసెంబరు 20: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కళ్యాణం కోసం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకొని ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మ ణ్య(కుమారస్వామి) స్వామికి విశేష అభిషేకం, పూజాదికాలు, హోమం, విశేషంగా శ్రీవల్లీదేవసమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణా న్ని వైభవంగా జరిపించారు. పంచామృతాభిషేకం, మంగళ హారతులు నిర్వహించారు. అనంతరం అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేశారు. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటి స్తూ కుమారస్వామికి విశేషార్చనలు జరిపారు. కల్యాణోత్సవానికి ముందుగా అర్చకస్వాములు ముందుగా కల్యాణోత్సవ సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ నిర్వహించారు. తరువాత స్వామివారికి కంకణధారణ చేసి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.


కొత్తపల్లి: నల్లమలలో కొలువైన కొలను భారతి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం స్వామి వారి షష్ఠి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పుష్పార్చన, బిల్వార్చన పూజలు జరిపించారు. అలాగే కొలను భారతి సరస్వతి అమ్మవారిని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చ విశేషాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.


Updated Date - 2020-12-21T05:28:09+05:30 IST