వైభవంగా పల్లకి సేవ
ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST
శ్రీశైల క్షేత్రంలో లోకకళ్యాణం కోసం ఆదివారం స్వామిఅమ్మవార్లకు పల్లకీసేవను నిర్వహించారు. ముందుగా అర్చకస్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు.

శ్రీశైలం, డిసెంబరు 20: శ్రీశైల క్షేత్రంలో లోకకళ్యాణం కోసం ఆదివారం స్వామిఅమ్మవార్లకు పల్లకీసేవను నిర్వహించారు. ముందుగా అర్చకస్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకీలో ఆశీనులనుజేసి శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు చేసి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈవో కేఎస్ రామరావు పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలో అర్చకులు, వేదపండితులు భౌతిక దూరాన్ని పాటిస్తూ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.