-
-
Home » Andhra Pradesh » Kurnool » special for multi talented persons
-
తుంగభద్రలో దివ్యాంగులకు ప్రోక్షణ
ABN , First Publish Date - 2020-11-28T05:08:15+05:30 IST
డీజీపీ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఎస్పీ కె.ఫక్కీరప్ప ప్రోక్షణ చేయించారు.
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎస్పీ ఫక్కీరప్ప
కర్నూలు(అర్బన్), నవంబరు 27: డీజీపీ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఎస్పీ కె.ఫక్కీరప్ప ప్రోక్షణ చేయించారు. శుక్రవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాల్లో అంధులు, అనాథలు, దివ్యాంగులకు పూజారులచే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు అంధుల పాఠశాలలకు చెందిన 30 మంది దివ్యాంగులకు పూజారులచే పుష్కర పూజలు సంక ల్బాగ్‌లోని యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయిం చారు. తలమీద తుంగభద్ర నీరు చల్లారు. అనం తరం ఎస్పీ దివ్యాంగులకు ఉలన్ బెడ్‌షీట్లు, స్వీటు బాక్సులు అందజేశారు.