-
-
Home » Andhra Pradesh » Kurnool » SP Fakkeerappa
-
జనతా కర్ప్యూ సంపూర్ణం: ఎస్పీ
ABN , First Publish Date - 2020-03-23T10:32:06+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జరిగిన జనతా కర్ప్యూ సంపూర్ణమైందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.

కర్నూలు, మార్చి 22: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జరిగిన జనతా కర్ప్యూ సంపూర్ణమైందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో 5 గంటలకు పోలీస్ యంత్రాంగం చప్పట్లు కొడుతూ సైరన్ మోగించారు. కరోనా వైరస్ కట్టడికి, నివారణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కొండారెడ్డి బురుజు నుంచి రాజ్‌విహార్ వరకు, అక్కడి నుంచి తిరిగి కొండారెడ్డిబురుజు వరకు పోలీసు వాహనాలు సైరన్ మోగిస్తూ తిరిగాయి. పోలీసు బృందాలు ప్రధాన కూడల్లో గస్తీలు నిర్వహిస్తూ విధులు నిర్వహించారన్నారు. అడిషినల్ ఎస్పీ గౌతమి, ట్రైనీ ఐపీఎస్ తుషార్, ఏఆర్ అడిషినల్ ఎస్పీ రాధాకృష్ణ, కర్నూలు డీఎస్పీ బాబా ఫకృద్దీన్, ట్రాఫిక్ డీఎస్పీ, ఏఆర్ డీఎస్పీలు మహబూబ్‌బాషా, ఇలియాజ్‌బాషా, ట్రైనీ డీఎస్పీ భవ్యకిషోర్ పాల్గొన్నారు.
పాణ్యం: మండలంలోని గ్రామాల్లో జన తా కర్ఫ్యూను ప్రజలు ఆదివారం పాటిం చారు. పాణ్యం వద్ద 40వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బస్టాండు కూడలి నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా, వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇసుక డం పింగ్ యార్డుల్లో నిశ్శబ్ద వాతావరణం నెల కొంది. ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు నిలిచిపోయాయి. డోన్ నుంచి గుంటూరు, కాచిగూడ నుంచి గుంటూరు, విజయవాడ నుంచి హుబ్లి, నంద్యాల నుంచి కర్నూ లు టౌన్‌కు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి.
గడివేముల: ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించారు. ఉదయం నుంచి ఇళ్ల నుంచి బయటకు రాలేదు. వ్యాపారులు స్వ చ్ఛందంగా దుకాణాలు మూసి వేశారు. ఆటో లు, వాహనాలు తిరగకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్న వైద్యులకు సంఘీభావంగా చప్పట్లు కొట్టారు.