సొంతింటి కలను జగన్‌ నెరవేరుస్తున్నారు

ABN , First Publish Date - 2020-12-30T05:34:15+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

సొంతింటి కలను జగన్‌ నెరవేరుస్తున్నారు

  1.  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
  2.  రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన


బేతంచెర్ల, డిసెంబరు 29: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బేతంచెర్ల నుంచి చెన్నంశెట్టిపల్లె వరకు రూ.9కోట్లతో డబుల్‌రోడ్డు నిర్మాణం, రూ.23 లక్షలతో తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్‌నగర్‌ మీదుగా బుగ్గానిపల్లె, బేతంచెర్ల వరకు చేపట్టే రోడ్ల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని రైల్వేగేటు నుంచి సంజీవనగర్‌, హనుమాన్‌నగర్‌, సరస్వతీ శిశుమందిర్‌ మీదుగా నంద్యాల క్రాస్‌రోడ్డు వరకు రూ.4.70 కోట్లతో నిర్మించిన బైపా్‌సరోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి చేయూత పథకం కింద రూ.3.50 కోట్లు సీఎం ఇచ్చారని తెలిపారు. బుగ్గన కుటుంబంలో వంద సంవత్సరాలుగా ఎవరు రాజకీయంగా ఎదగలేదని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు విమర్శించారని, ఇప్పుడు మంత్రి గా బేతంచెర్లను అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, తహసీల్దారు విద్యాసాగర్‌, ఎంపీడీవో అశ్వినికుమార్‌, వైసీపీ నాయకులు బుగ్గన నాగభూషణంరెడ్డి, బుగ్గన ప్రభాకర్‌రెడ్డి, ముర్తుజావలి, ఖాజాహుస్సేన్‌, గూని నాగరాజు తదిత రులు పాల్గొన్నారు. సిమెంట్‌నగర్‌ గ్రామానికి చెందిన పది స్వయం సహాయక  సంఘాల మహిళలకు ఒక్కొక్క గ్రూపునకు రూ.10 లక్షలు ప్రకారం రూ.కోటి చెక్కును ఏపీఎం లింగమయ్య ఆధ్వర్యంలో మంత్రి అందజేశారు. 

Updated Date - 2020-12-30T05:34:15+05:30 IST