ఇనుప రింగును మింగిన బాలిక.. ఎండోస్కోపి ద్వారా తొలగించిన జీజీహెచ్ వైద్యులు
ABN , First Publish Date - 2020-06-25T20:55:47+05:30 IST
ఆరేళ్ల బాలిక ప్రమాదవశాత్తు మింగిన ఇనుపరింగును ఎండోస్కోపి ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగపు వైద్యులు బయటికి తీశారు. గోస్పాడు మండలం

కర్నూలు(ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల బాలిక ప్రమాదవశాత్తు మింగిన ఇనుపరింగును ఎండోస్కోపి ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగపు వైద్యులు బయటికి తీశారు. గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెం దిన సురేష్, రేణుక దంపతుల ఏకైక కుమార్తె ఆరేళ్ల నాగ అక్షయ ఈ నెల 16వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇనుపరింగ్‌ను మింగింది. తల్లిదండ్రులు బాలికను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. వారం రోజులు అయినా మలంలో రింగు పడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బాలికను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగాధిపతి డా.బి.శంకర్‌శర్మను బాలికను పరీక్షించి కడుపులో ఇనుప రింగు ఉన్నట్లు గుర్తించారు. బుధవారం బాలికకు మత్తుమందు ఇవ్వకుండా ఎండోస్కోపి ద్వారా ఆయన రింగును బయటికి తీశారు.