జంధ్యాల రఘుబాబుకు ఉగాది పురస్కారం
ABN , First Publish Date - 2020-03-16T11:01:26+05:30 IST
జంధ్యాల రఘుబాబుకు ఉగాది పురస్కారం
కర్నూలు (కల్చరల్), మార్చి 15: తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాలోని వెన్నెల సాహిత్య అకాడమీ ఏటా ప్రదానం చేస్తున్న ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది పురస్కారానికి కర్నూలుకు చెందిన కవి, రచయిత, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధాల రఘుబాబును ఎంపిక చేసింది. ఈమేరకు ఈనెల 22న సిద్దిపేటలోని శివానుభవ మంటపంలో జరిగే ఈ కార్యక్రమంలో సినీ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, సిద్దిపేట జడ్పీ ఛైర్‌పర్సన్ వేలేటి రోజరాధాకృష్ణ శర్మ, ఏపీ సాహిత్య అకాడమీ ఛైర్మన్ ఆచార్య కొలుకలూరి ఇనాక్ చేతుల మీదుగా ప్రదానం చేస్తున్నారు. కవిత్వం, కథా సాహిత్యంలో రఘుబాబు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఇటీవల పెట్టుడు రెక్కలు పేరుతో కథా సంకలనం వెలువరించారు. గతంలో ప్రతిష్టాత్మక గురుజాడ ఫౌండేషన్ వారి పురస్కారం, పండిత హీరాలాల్ స్మారక సాహిత్య పురస్కారాలను రఘుబాబు అందుకున్నారు.