‘బదిలీల్లో అన్ని ఖాళీలూ చూపాలి’
ABN , First Publish Date - 2020-12-11T05:48:55+05:30 IST
ఉపాధ్యాయ బదిలీల్లో అన్ని ఖాళీలు చూపిం చాలని ఫ్యాప్టో నాయకులు హృదయరాజు, ప్రకాష్ రావు, హెచ్.తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 10: ఉపాధ్యాయ బదిలీల్లో అన్ని ఖాళీలు చూపిం చాలని ఫ్యాప్టో నాయకులు హృదయరాజు, ప్రకాష్ రావు, హెచ్.తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. డీఈవో, సమగ్ర శిక్ష కార్యాలయం ఉద్యోగులను బయటకు పంపి తలు పులు మూసేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసన సాగించారు. నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి అన్ని కేటగిరీల వారిగా మాన్యువల్ విధానం అమలు చేయాలన్నారు. సర్వీసులో ఏడాదికి పాయింటు చొప్పున కేటాయిం చాలని డిమాండ్ చేశారు.
బదిలీల్లో విద్యాశాఖ అధికారులు నిరంకుశ విధానాలను వీడనాడాలన్నారు. ప్రతి పాఠశాలలో రెండు టీచర్ పోస్టులు కొనసాగించి, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులు ఉండాలని కోరారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జె.సుధాకర్, రంగన్న, కరెకృష్ణ, శివయ్య, ఎస్.గోకారి, రామశేషయ్య, ఇస్మాయిల్, మాధవ స్వామి, ప్రసాద్, మధుసూదన్ రెడ్డి, యోగీశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.