ఎన్నికల సిబ్బందికి భత్యాలు

ABN , First Publish Date - 2020-03-18T11:28:21+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి భత్యాలు(టీఏ, డీఏ) చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల సిబ్బందికి భత్యాలు

కర్నూలు(కలెక్టరేట్‌) మార్చి 17:స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి భత్యాలు(టీఏ, డీఏ)  చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం   జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో  జోనల్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లు, సెక్టోరల్‌ ఆఫీసర్లకు రూ.1500, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లకు రూ.350, పోలింగ్‌ ఆఫీసర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు  రోజుకు రూ.250, ఆఫీసు సబార్డినేటర్లకు  రూ.150, భోజనం కోసం రూ.150 చెల్లంచాలని పేర్కొంది.  

Updated Date - 2020-03-18T11:28:21+05:30 IST