రెండో రోజు అంతంత మాత్రమే!

ABN , First Publish Date - 2020-11-22T04:48:50+05:30 IST

తుంగభద్ర పుష్కరాల్లో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని ఘాట్ల లో రెండో రోజు కూడా భక్తులు అంతగా కనిపించలేదు.

రెండో రోజు అంతంత మాత్రమే!
మంత్రాలయంలోని వినాయక్‌ఘాట్‌ వద్ద షవర్లలోంచి వచ్చే నీరు రాకపోవడంతో స్నానం చేసేందుకు వేచి ఉన్న భక్తులు

  1. భక్తులు లేక  ఘాట్లు  వెలవెల
  2.  నదిలో  నీరు లేక అవస్థలు
  3. సౌకర్యాలు కల్పించని అధికారులు 


తుంగభద్ర పురష్కరాల్లో రెండో రోజు కూడా భక్తులు నది వద్దకు పెద్దగా రాలేదు. దీంతో పుష్కర ఘాట్లు వెలవెలబోయాయి. కొవిడ్‌ కారణంగా ప్రభుత్వం నదీ స్నానాలకు అనుమతి ఇవ్వలేదు. ఘాట్లలో ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు చేయాలని సూచించింది. దీంతో చాలా ఘాట్లలో సిబ్బంది మాత్రమే కనిపించారు. గురజాల, మంత్రాలయం, వెళిగనూరు తదితర ఘాట్ల వద్ద కొందరు భక్తులు షవర్ల కింద స్నానం చేసి పూజలు చేసుకుని వెళ్లిపోయారు. 

 

మ్మిగనూరు/ కోసిగి/ పెద్దకడుబూరు/ కౌతాళం,నందవరం, సి.బెళగల్‌, కోడుమూరురూరల్‌: నవంబరు21: తుంగభద్ర   పుష్కరాల్లో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని ఘాట్ల లో రెండో రోజు కూడా భక్తులు అంతగా కనిపించలేదు. నదిలో స్నానాలకు అనుమతించ కపోవడమే కారణంగా తెలుస్తోంది. మంత్రాల యం ఎన్‌ఎఏపీ పంపుహౌస్‌ ఘాట్‌, నందవరం మండలం నాగులదిన్నె, మంత్రా లయం మండలం రాంపురం, కాచాపురం ఘాట్‌, కౌతాళం మండలంలోని మేళిగనూరు ఘాట్లు భక్తజన సందడి లేక వెలవెలబోయాయి.  


  పుష్కరాల్లో పిండ ప్రధానం పూజలు నిర్వహించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోంచి నాగులదిన్నె, గురుజాల, మంత్రాలయానికి అనేకమంది పురోహి తులు ఒకరోజు ముందుగానే చేరుకున్నారు. అయితే నదిలో స్నానాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో భక్తులు అంతగా కనిపించక పోవడంతో పురోహితుల ఆశలు ఆడియాసలయ్యాయి. 


  గురుజాల, నాగలదిన్నె పుష్కర ఘాట్లను డీపీవో ప్రభాకర్‌రావు పరిశీలిం చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఇన్‌చార్జిలు, నోడల్‌ అధికారి రాఘవేంద్ర, డీఎస్పీలు, నాగసుబ్బయ్య, రవీంద్రరెడ్డి, రూరల్‌ సీఐ మంజునాథ్‌, ఎంపీడీవో ఫజుల్‌బాషా, తహసీల్దారు నాగరాజు, ఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు. 

 గుండ్రేవుల పుష్కరఘాట్‌ భక్తులు లేక వెలవెల బోతోంది. శనివారం 150 మంది మాత్రమే వచ్చినట్లు సమాచారం.  

 సుంకేసుల పుస్కరఘాట్‌ వద్ద రెండవరోజు భక్తులు లేక వెలవెల బోయింది.  


మొరాయించిన షవర్లు

మంత్రాలయంలోని వినాయక ఘాట్‌ వద్ద పుష్కర స్నానం చేసేందుకు శనివారం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో షవర్లలో నీరు రావడం నిలిచిపోయింది. అరగంట పాటు భక్తులు స్నానం చేసేందుకు అక్కడే నిలబడ్డారు. ఈ సమస్యను ఆంధ్రజ్యోతి చిత్రీకరిస్తుం డటంతో అధికారులు అప్పటికప్పుడు మరమ్మతు చేశారు. పుష్కరాలకు పది రోజుల ముందే పూర్తి చేయాల్సిన పనులను ఇప్పుడు ప్రారంభిస్తే ఫలితం ఇలానే ఉంటుందని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. షవర్లలో నీరు రాదని అధికా రులను అడిగితే రిపేరీ చేయాల్సి ఉందని అరగంట సేపు నిలబెట్టారని అనంతపురానికి చెందిన రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


 కర్నూలు(అర్బన్‌): తుంగభద్రలో నదిలో నీటి ప్రవాహం తగ్గింది. మరో వైపు నదీ స్నానాలను ప్రభుత్వం నిషేధించండంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు లేక పుష్కర ఘాట్లు వెలవెలబోతున్నాయి. పిండ ప్రధానాలు చేశాక వాటిని వదిలేందుకు నీరు తక్కువగా ఉండటంతో భక్తులు మండిపడుతున్నారు.


గొందిపర్ల పుష్కర ఘాట్‌లో..

కర్నూలు(రూరల్‌): మండలంలోని గొందిపర్ల పుష్కరఘాట్‌ వద్ద శనివారం భక్తులు లేక వెలవెలబోయింది. ఘాట్‌ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రభుత్వ అధికారులు కూడా భక్తుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. 

 

 పిండ ప్రదానాల కోసం ఇక్కట్లు

కర్నూలు(అర్బన్‌): తుంగభద్రలో నదిలో నీటి ప్రవాహం తగ్గింది. మరో వైపు నదీ స్నానాలను ప్రభుత్వం నిషేధించండంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు లేక పుష్కర ఘాట్లు వెలవెలబోతున్నాయి. పిండ ప్రధానాలు చేశాక వాటిని వదిలేందుకు నీరు తక్కువగా ఉండటంతో భక్తులు మండిపడుతున్నారు.


గొందిపర్ల పుష్కర ఘాట్‌లో..

కర్నూలు(రూరల్‌): మండలంలోని గొందిపర్ల పుష్కరఘాట్‌ వద్ద శనివారం భక్తులు లేక వెలవెలబోయింది. ఘాట్‌ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రభుత్వ అధికారులు కూడా భక్తుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. 


యాగక్రతువు

ఆత్మకూరు/కొత్తపల్లి: సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో తుంగ భద్ర పుష్క రాలను పురస్కరించుకుని పుష్కర బృహస్పతి గాయత్రీ యాగాన్ని ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ నేతృత్వంలో శాస్ర్తోంగా నిర్వహించారు. శనివారం ఎగువ ఉమా మహేశ్వరాలయంలోని శివలింగానికి ప్రత్యేక పూజలు చేయ డం తో పాటు గాయత్రీదేవి, లలితా సంగమేశ్వర స్వామిఅమ్మ వార్లు, సీతారాములు, సత్యనారాయణ సహిత లక్ష్మీదేవీ తదితర దేవతా మూర్తుల ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, అలంకరణతో పాటు విశేష పూజ క్రతువులను జరిపారు. అలాగే గోధూళి సమయాన నదీజలాలకు గంగాహారతిని నివేదించారు.


ఆత్మకూరు: సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో తుంగభద్ర పుష్కర శోభ కనిపిం చడం లేదు. కొవిడ్‌ నేపథ్యంలో పుణ్య స్నానాలకు అనుమతించకపోవడంతో క్షేత్రానికి భక్తులు ఎక్కువగా రావడం లేదు. రెండో రోజు శనివారం కూడా భక్తులు అంతంతమా త్రంగానే వచ్చారు. 


సదుపాయాలు లేవు..

తుంగభద్ర పుష్కరాల్లో రెండో రోజు కూడా సదుపాయాల కల్పన అంతంతమాత్రంగానే సాగింది. పుష్కర ఘాట్లు, ఉమామ హేశ్వర ఆలయ పరిసరాల్లో ఎక్కడ తాగునీటి సదుపాయం కల్పించలేదు. ప్రత్యేక వైద్యశిబిరాలు కూడా అందుబాటులో లేవు.   బస్టాండ్‌ నుంచి పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లేందుకు వికలాంగులకు, వృద్ధులకు వీల్‌చైర్స్‌ వంటివి అందుబాటులో లేవు. 


పుష్కరస్నానాలు

కర్నూలు(న్యూసిటీ): నగరంలోని నగరేశ్వరస్వామి, రాఘవేంద్రమఠం, రాంబోట్ల దేవాల యాల వద్ద ఏర్పాటు చేసిన ఘాట్లలో భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు.  శనివారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు రద్దీ ఎక్కువగా ఉంది. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి పుష్కరస్నానాలు ఆచరించి పిండ ప్రదానం చేశారు.  భోజనవసతి లేక ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాఘవేంద్ర మఠంలో విజయనగరం, విజయవాడ నుంచి వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పిండప్రధాన పూజలు చేశారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ నగరేశ్వరస్వామి, రాఘవేం ద్రమఠం, రాంబో ట్ల దేవాలయ ఘాట్లను సందర్శించారు.  రాంబోట్ల ఘాట్‌ వద్ద శ్రీలలిత పీఠం తుంగభద్ర పుష్కర సమితి సభ్యులు బాలాజీరావు, విఠల్‌రావు, గంగాధర్‌రావు, శ్రీనివాసరావు, సుబ్బారావు ఏర్పాటు చేసి న భోజన ప్యాకెట్లను ఎమ్మెల్యే భక్తులను పంపిణీ చేశారు. 


 Read more