తెలంగాణ మద్యం సీజ్‌

ABN , First Publish Date - 2020-11-28T04:35:12+05:30 IST

స్పెషల్‌ ఎన్ఫోర్సుమెంట్‌ బ్యూరో నిర్వహించిన తనిఖీల్లో 2,027 తెలంగాణ మద్యం సీసాలు సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు.

తెలంగాణ మద్యం సీజ్‌

కర్నూలు(అర్బన్‌), నవంబరు 27: స్పెషల్‌ ఎన్ఫోర్సుమెంట్‌ బ్యూరో నిర్వహించిన తనిఖీల్లో 2,027 తెలంగాణ మద్యం సీసాలు సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. శుక్రవారం పంచలింగాల చెక్‌ పోస్టులో వాహనలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పి. రామచంద్ర, గట్టు పల్లి రవికుమార్‌ జీపులో మద్యం తరలిస్తుండగా సీజ్‌ చేశామని, బైకులో ఎం. శ్రీరామ్‌ అనే వ్యక్తి 23 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో హెడ్‌ కానిస్టేబుళ్లు షరీఫ్‌, జగన్నాథ్‌, పోలీసులు శ్రీనివాసులు, శేఖర్‌ పాల్గొన్నారు.


Read more