రెడ్‌జోన్‌లో ఆకలి కేకలు
ABN , First Publish Date - 2020-05-09T08:32:29+05:30 IST
లాక్‌డౌన్ వల్ల నంద్యాల పట్టణంలో ఆకలి కేకలు వినిపించాయి. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని సలీం
రోడ్డు మీదకు వందలాది మంది..
నంద్యాల టౌన్, మే 8: లాక్‌డౌన్ వల్ల నంద్యాల పట్టణంలో ఆకలి కేకలు వినిపించాయి. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని సలీం నగర్ రెడ్‌జోన్‌లో ఉంది. దీనితో ఇండ్ల నుంచి బైటికి రావద్దని అధికారులు, పోలీసులు స్థానికులను కట్టడి చేశారు. ఇళ్లకే నిత్యావసరాలు సరఫరా చేస్తామని అన్నారు. కానీ ఆచరణలో ఏమీ జరగలేదు. కాలనీ వాసులు సచివాలయం, వార్డు వలంటీర్ల దృష్టికి తీసికెళ్లారు. వాళ్లూ స్పందించలేదు. నిత్యావసర వస్తువులు లేక ఆకలితో ఇబ్బంది పడలేక శుక్రవారం వందలాదిగా కాలనీ వాసులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు వారితో చర్చించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనితో స్థానికులు ఆందోళన విరమించారు.
పట్టించు కోవటం లేదు: ఫాతిమా, సలీం నగర్
కొన్ని రోజులుగా కూరగాయలు లేక వంట చేయడమే కష్టమైనది. ఇంటి నుంచి బయటకు రావద్దని అంటున్నారు. ఇంటికే సరుకులు అందిస్తామని చెప్పారు. కానీ పట్టించుకోవటం లేదు.