ఆర్‌ఏఆర్‌ఎస్ భూములను కాపాడండి
ABN , First Publish Date - 2020-11-14T05:26:04+05:30 IST
నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కాపాడాలని, దానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాలకు ఇవ్వరాదని నరసింహ రకం పత్తి సృష్టికర్త, అంతర్జాతీయ పత్తి శాస్త్రవేత్త డాక్టర్ కె.రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు.
నంద్యాల, నవంబరు 13: నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కాపాడాలని, దానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాలకు ఇవ్వరాదని నరసింహ రకం పత్తి సృష్టికర్త, అంతర్జాతీయ పత్తి శాస్త్రవేత్త డాక్టర్ కె.రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నంది రైతు సమాఖ్య ప్రతినిధులతో కలిసి మాట్లాడుతూ 1906లో ఈ పరిశోధనా కేంద్రం ప్రారంభమైందని, దేశంలోని పురాతన పరిశోధనా సంస్థగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిందని అన్నారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ రూపొందించిన వరి రకాలలో కర్నూలు సోనా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. నరసింహ పత్తి రకాన్ని తాను సృష్టించానని, ఈ రకం పత్తి వల్ల దాదాపు 80 విత్తన సంస్థలు ఆడ విత్తనంగా వాడి దేశ సంపదను పెంచాయని గుర్తు చేశారు. జొన్న, కొర్ర, పప్పు శనగ, పొద్దు తిరుగుడు, చిరు ధాన్యాలలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త రకాల విత్తనాలు విడుదల అయ్యాయన్నారు. ఇంత విశిష్టత కలిగిన ఆర్‌ఏఆర్‌ఎస్ భూమిని వైద్య కళాశాలకు ఇచ్చే విషయంపై సీఎం జగన్ పునరాలోచించాలని కోరారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని, ఆర్‌ఏఆర్‌ఎస్ భూములను అన్ని విధాలుగా రక్షించాలని కోరారు. నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.8 అంతర్జాతీయ పత్తి శాస్త్రవేత్త డాక్టర్ కే రవీంద్రనాథ్