-
-
Home » Andhra Pradesh » Kurnool » Sarvatrika Samme Tomarow
-
‘రేపటి సమ్మెను విజయవంతం చేయండి’
ABN , First Publish Date - 2020-11-25T05:55:38+05:30 IST
దేశవ్యాప్త సమ్మెను గురువారం విజయవంతం చేయాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

బనగానపల్లె, నవంబరు 24: దేశవ్యాప్త సమ్మెను గురువారం విజయవంతం చేయాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం బనగానపల్లెలోని సీఐటీయూ కా ర్యాలయంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ మాట్లాడారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలన్న తదితర డిమాండ్లతో సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు సుబ్బయ్య, అర్జున్, దస్తగిరి, మాబూహుస్సేన్, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.
సీపీఐ కార్యాలయంలో..
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సీపీఐ మండల కార్య దర్శి శివయ్య, ఏఐటీయూసీ నాయకుడు బాలకృష్ణ పిలుపు నిచ్చారు. సీపీఐ కార్యాలయంలో మంగళవారం పోస్టర్‌ను విడుదల చేశారు. సుబ్బయ్య, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల: దేశ వ్యాప్తంగా గురువారం జరిగే కార్మికుల సార్వత్రిక సమ్మెకు ఏపీ రైతు సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుం దని, సమ్మెలో పాల్గొననున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్, కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి పుల్ల నరసింహులు తెలిపారు. మంగళవారం నంద్యాలలో రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలందరూ మద్దతు తెలిపి పాల్గొనాలని వారు కోరారు.
చాగలమర్రి: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీ యూ జిల్లా నాయకుడు ఉసేన్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. హమాలీల సంఘం అధ్యక్షుడు గుత్తి నరసింహులు, అంగన్‌వాడీ వర్కర్లు, కస్తూర్బా కాంట్రాక్టు ఉద్యోగులు, ఆశా వర్కర్లు, హమాలీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
రుద్రవరం: దేశావ్యాప్తంగా గురువారం చేపట్టబోయే సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు శివ పిలుపునిచ్చారు. మంగళవారం రుద్రవరంలో ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాలతో చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. పుల్లయ్య, రాముడు, బుజ్జి, గంగయ్య, తిరుపాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగన్న, సీఐటీయూ మండల కార్యదర్శి షాజహాన్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో సార్వత్రిక సమ్మె పోస్టర్లను విడుదల చేశారు. నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, హుశేనాపురం, ఓర్వకల్లు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మధు, గంగన్న, మద్దయ్య, శంకర్, వెంకటేష్ పాల్గొన్నారు.
ఆత్మకూరు: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయా లని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉరుకుం దరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో రైతు కూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు జునైద్‌బాషా, పీవోడబ్ల్యూ నాయకురాలు రాణెమ్మ, ముర్తుజాబీ, ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
ఆత్మకూరురూరల్: దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, జిల్లా కార్యదర్శి రణఽ దీర్, ఎల్‌ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పుల్లయ్య పిలుప ునిచ్చారు. సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో సీఐటీయూ నాయకులు జబీవుల్లా, రోషన్, నాఘేశ్వరరావు, రసూల్, డీవైఎఫ్‌ఐ నాయకులు, గిరిజన సంఘం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం, ఎల్‌ఐసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
కొత్తపల్లి: దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్ల్లా కార్యదర్శి రణధీర్, మండల కార్యదర్శి నక్క దాసు కోరారు. మంగళవారం ఈ మేరకు మండలంలోని సింగరాజు పల్లిలో హమాలీ యూనియన్ నాయకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ నాయకులు గోపాల్, జయరాజు, ఇమ్మా నియేల్, రాజాబాబు, సామేలు వరప్రసాద్ పాల్గొన్నారు.