ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలి

ABN , First Publish Date - 2020-11-26T05:30:00+05:30 IST

నంద్యాలలో సమ్మెలో భాగంగా సభ నిర్వహించి ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలి
నంద్యాలలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులు

  1. వివిధ కార్మిక సంఘాల నిరసన
  2. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం


కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలని వివిధ ప్రజా, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం చేపట్టిన  సార్వత్రిక సమ్మె  విజయవంతంగా ముగిసింది. నాయకులు మాట్లాడుతూ కార్మిక, వ్యవసాయ చట్టాల్లో మార్పులు తెస్తూ ప్రభుత్వాలు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారని, విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పలు సంఘాలు ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి. కార్మికులు అధిక సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు.


నంద్యాల టౌన్‌, నవంబరు 26: నంద్యాలలో సమ్మెలో భాగంగా సభ నిర్వహించి ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టెక్కె మార్కెట్‌ యార్డులో సభ నిర్వహించిన తరువాత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకుడు నాగరాజు, ఏఐటీయూసీ నాయకుడు ప్రసాద్‌, ఐఎఫ్‌టీయూ నాయకుడు చౌడప్ప, కార్మికసంఘాల నాయకులు లక్ష్మణ్‌, బాలవెంకట్‌, గురువయ్య, ఆశ, అంగన్‌వాడీ వర్కర్స్‌, మధ్యాహ్న భోజనం, ప్రైవేట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


దొర్నిపాడు: ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ జయప్రసాద్‌ కు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా నాయకుడు నిరంజన్‌, నాయకుడు అరుణ్‌, అంగన్‌వాడీ టీచర్లు, వీఆర్‌ఏలు తదితరులు ఉన్నారు. 


ఆళ్లగడ్డ: పట్టణంలోని పోస్టాఫీసు వద్ద సమ్మె చేపట్టారు. ఆళ్లగడ్డ పోస్ట్‌మాస్టర్‌ సూర్యనారాయణరెడ్డి, కోటకందుకూరు బీపీఎం జగదీశ్వరరెడ్డి, జాఫర్‌, బేగ్‌, అబ్బాస్‌, జైలాబుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు రాజేష్‌, శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ గురువారం నిర్వహించారు. శ్రీని వాసులు, రాజేష్‌ పాల్గొన్నారు.


చాగలమర్రి: చాగలమర్రిలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్‌లో నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకుడు డి.ఉసేన్‌బాషా, హమాలీ యూనియన్‌ నాయకులు గుత్తి నరసింహులు, ఫకృద్దీన్‌, మాబువలి, చాంద్‌బా షా, మాబాషా, ఏఐటీయూసీ తాలుకా కన్వీనర్‌ చంద్రకళ, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 


గోస్పాడు: గోస్పాడు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. మండల కార్యదర్శి పుల్లా నరసింహుడు, కరీముల్లా, బాషా, చెన్నయ్య పాల్గొన్నారు.


నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు, మున్సిపల్‌ కార్మికులు, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి పటేల్‌ సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీలో కార్మికులు ఎర్ర రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. నాయకులు రఘురామ్మూర్తి, భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్‌బాబు, జగదీష్‌బాబు, మజీద్‌మియా, అరుణ్‌కుమార్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

 

మిడుతూరు: మిడుతూరులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర రావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అర్లప్ప ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. సీఐటీ యూ మండల నాయకులు నాగమణి, ఓబులేసు, రామకృష్ణ, రవికుమార్‌ పాల్గొన్నారు.


పగిడ్యాల: పగిడ్యాల తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ మాధవికి వినతి పత్రం అందజేశారు. వ్య.కా.స. జిల్లా నాయకులు పి. పక్కీర్‌సాహెబ్‌, ఈశ్వరమ్మ, నాయకులు లక్ష్మన్న, భారతమ్మ, లలితమ్మ, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.


బండి ఆత్మకూరు: బండిఆత్మకూరులో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్‌లో ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకుడు రత్నమయ్య, కేవీపీఎస్‌ నాయకుడు ఏసేపు, ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు భాగ్యమ్మ, సుబ్బరాయుడు, మునిస్వామి, వెంకటరమణమ్మ, శ్రీను, శిరోమణి తదితరులు పాల్గొన్నారు.


బనగానపల్లె: బనగానపల్లె పెట్రోల్‌బంక్‌ కూడలిలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ డివిజన్‌ అధ్యక్షుడు సుబ్బయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, వీఆర్‌ఏల సంఘం నాయకులు బాలుడు, వీవోఏల సంఘం నాయకుడు సోమశేఖరప్ప, ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు తులశమ్మ, సీపీఐ నాయకుడు శివయ్య, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు దస్తగిరి పాల్గొన్నారు.


కోవెలకుంట్ల: పట్టణంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.సుధాకర్‌ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ముందుగా ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్మికులు, వీఆర్‌ఏలు, వీవోఏలు అధిక సంఖ్యల పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ సర్కిల్‌ వద్ద రాస్తారోకో చేశారు. సీఐటీయూ నాయకులు సరస్వతి, వెంకటలక్ష్మి, ఆశా కార్యకర్తలు సరస్వతి, రమణమ్మ, గ్రామ పంచాయతీ వర్కర్లు వెంకటరాముడు, నరసింహుడు, విజయ్‌, వీఆర్‌ఏల సంఘం నాయకులు శివరాం, వన్నూరు, కార్మికులు పాల్గొన్నారు.


కొత్తపల్లి: తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ సెంటరు వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. వ్య.కా.స. కార్యదర్శి నక్కా స్వాములు, సీఐటీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్‌ రెహమాన్‌, దాసు, అంగన్‌వాడీలు మరియమ్మ, విజయమ్మ, గ్రామ సేవకులు సవారయ్య, పుల్లయ్య ,ముర్తుజావలి తదితరులు పాల్గొన్నారు.


కొలిమిగుండ్ల: కొలిమిగుండ్లలో అంగన్‌వాడీ కార్యకర్తలు, రెవెన్యూ ఉద్యోగులు, కార్మికులు ర్యాలీ, నిరసన చేపట్టారు. తహసీల్దారు కార్యాల యం వరకు ర్యాలీ చేసి అనంతరం తహసీ ల్దారు షేక్‌ మొహిద్దీన్‌కు వినతిపత్రం అందిం చారు. సీపీఎం మండల కార్యదర్శి దావీదు, వీఆర్‌ఏలు పుల్లయ్య, రమణ, శివరాముడు, కుళ్లాయప్ప, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


పాములపాడు: పాములపాడు బస్టాండ్‌ ఆవరణలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. అలాగే ర్యాలీ నిర్వహించారు. జిల్లా రైతు సంఘం నాయకులు రామేశ్వరరావు, సీపీఎం, సీపీఐ నాయకులు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌, ఏపీ అంగన్‌ వాడి వర్కర్స్‌ యూనియన్‌, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, భవననిర్మాణ కార్మికుల యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. 

ఆత్మకూరు: ఆత్మకూరులో నిరసన ర్యాలీలు చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, డివిజన్‌ నాయకుడె రణధీర్‌ పాల్గొన్నారు. ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేపటా ్టరు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై నాగేంద్రప్రసాద్‌ పర్యవేక్షించారు. 


వెలుగోడులో..

 వెలుగోడులో వివిధ సంఘాలతో కలిసి నిరసనలు చేపట్టారు. పొట్టిశ్రీరాములు సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. సీఐటీయూ మండల నాయకుడు రామాంజనేయులు, ఏపీ రైతు సంఘం నాయకుడు యాదాటి నాగేంద్రుడు, కేవీపీఎస్‌ జిల్లా నాయకుడు రామదాస్‌ తదితరులు ఉన్నారు. 


పాణ్యం: పాణ్యం బస్టాండ్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రస్తారోకో నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి రత్నమ్మ, సీఐటీయూ మండల కార్యదర్శి భాస్కర్‌, అంగన్‌వాడీ, ఆటో, హమాలి ఆశ, వీవోలు, తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


రుద్రవరం: రుద్రవరంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు ర్యాలీ చేశారు. సీఐటీయూ నాయకుడు శివ, అంగన్‌వాడీ కార్యకర్తలు తిరుపాలమ్మ, సుబ్బమ్మ, విజయ, విజయలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T05:30:00+05:30 IST