సలాం కుటుంబానికి న్యాయం చేయాలి: టీడీపీ
ABN , First Publish Date - 2020-11-14T05:25:15+05:30 IST
నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డోన్ టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు అన్వర్‌బాషా డిమాండ్ చేశారు.
డోన్, నవంబరు 13: నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డోన్ టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు అన్వర్‌బాషా డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని పాతపేట జామియా మసీదులో సలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి చేకూరాలని ముస్లిం మైనార్టీ నాయకులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వర్‌బాషా మాట్లాడుతూ అధికార పార్టీ, పోలీసుల వేధింపుల వల్లే సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు మాబుహుశేన్, ముస్తాఫా, జాబర్, నూర్ అహ్మద్, ఖలీల్, మాసుమ్ బాషా, ఇదుర్‌బాషా, సిరాజ్, హుశేన్, మహ్మద్ రఫీ పాల్గొన్నారు.
మద్దికెర: సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఆరాచకాలు పెరిగి పోయాయని మాజీ సర్పంచ్ వెంకటవర్మ, మాజీ ఎంపీటీసీ పులిశేఖర్, వాల్మీకి సంఘం నాయకుడు రామాంజినేయులు, మైనార్టీ నాయకుడు ఫకృద్దీన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెరవలిలో సలాం కుటుంబానికి శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాయకులు బొంబాయి సుధాకర్, రంగస్వామి, రాముడు పాల్గొన్నారు.