-
-
Home » Andhra Pradesh » Kurnool » salam kutubaniki cm hami
-
సలాం కుటుంబానికి సీఎం హామీ
ABN , First Publish Date - 2020-11-21T06:07:32+05:30 IST
నంద్యాలలో ఇటీవలే కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ సలాం అత్త మాబున్నీసా, ఆమె కుమారుడు శంషావలి, కుమార్తె సాజీదాను తిరుగు ప్రయాణంలో ఏపీ ఎస్సీ గెస్ట్ హౌస్ వద్ద సీఎం జగన్ పరామర్శించారు.

- కుమార్తెకు ఉద్యోగం, అల్లుడికి బదిలీ కోరిన సలాం అత్త
- విజయ డెయిరీ చైర్మన్‌గా ఎస్వీ జగన్మోహన్‌రెడ్డి
- నందికొట్కూరు, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాలపై సూచనలు
కర్నూలు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): నంద్యాలలో ఇటీవలే కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ సలాం అత్త మాబున్నీసా, ఆమె కుమారుడు శంషావలి, కుమార్తె సాజీదాను తిరుగు ప్రయాణంలో ఏపీ ఎస్సీ గెస్ట్ హౌస్ వద్ద సీఎం జగన్ పరామర్శించారు. సీఎం ప్రకటించిన రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే ద్వారా అంది ంచడం పట్ల మాబున్నీసా ధన్యవాదాలు తెలిపారు. కుమార్తె సాజీదాకు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగం ఇవ్వాలని, వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న తన అల్లుడికి అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ చేయాలని, దోషులను శిక్షించాలని సీఎంను కోరారు. దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పిన సీఎం.. బదిలీ, ఉద్యోగం విషయంపై కలెక్టర్ వీరపాండియన్‌ను, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీ ఫక్కీరప్పను ఆదేశించారు. దీంతో శంషావలిని డిప్యుటేషన్‌పై నంద్యాల ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గాలపై సీఎం
ఇటీవల కోడుమూరు, నందికొట్కూరు, కర్నూలు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఒకరిపై మరొకరు ప్రతి విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్ శుక్రవారం ఆ నియోజకవర్గాల నాయకులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కలుపుకుపోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, సమన్వయకర్తలు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డికి చెప్పారని సమాచారం. అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఆర్థర్ వివాదం పరిష్కార బాధ్యతను నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. విజయ డెయిరీ భవిష్యత్ చైర్మన్‌గా ఎస్వీ జగన్మోహన్‌రెడ్డిని ఎంపిక చేయాలని వైసీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఎస్వీ మోహన్‌రెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటుచేశారు. సీఎం కూడా ఎస్వీ జగన్మోహన్‌కే మద్దతు పలికినట్లు సమాచారం.