సచివాలయంలో దొంగలు పడ్డారు

ABN , First Publish Date - 2020-11-26T05:55:53+05:30 IST

మండల పరిధిలోని జి.ఎర్రగుడి గ్రామ సచివాలయంలో దొంగలు పడి కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులను ఎత్తుకెళ్లినట్లు జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

సచివాలయంలో దొంగలు పడ్డారు

  1.   కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువుల చోరీ  


తుగ్గలి, నవంబరు 25: మండల పరిధిలోని జి.ఎర్రగుడి గ్రామ సచివాలయంలో దొంగలు పడి కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులను ఎత్తుకెళ్లినట్లు జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. బుధవారం తెల్లవారుజామున జి.ఎర్రగుడి సచివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి మూడు కంప్యూటర్లు, సీపీయులు, ఎలక్ట్రికల్‌ వస్తువులు ఎత్తుకెళ్లారని సచివాలయ సిబ్బంది జొన్నగిరి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలానికి వెళ్లి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ వస్తువుల్లో కొన్ని ఉన్నత పాఠశాల ఆవరణలో దొరికినట్లు తెలిపారు. సచివాలయంలో దొంగలించిన వస్తువుల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు.  

Updated Date - 2020-11-26T05:55:53+05:30 IST