సచివాలయాల ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2020-12-27T04:58:46+05:30 IST

పట్టణంలోని 2,3,5 గ్రామ సచివాలయాలను కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సచివాలయాల ఆకస్మిక తనిఖీ
సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

బనగానపల్లె, డిసెంబరు 26: పట్టణంలోని 2,3,5 గ్రామ సచివాలయాలను కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంట్‌ రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌, ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లను పరిశీలించారు. సచివాలయానికి వచ్చిన సర్వీసులు, ఎన్ని పరిష్కారం చూపారు అనే వివరాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మన బడి, నాడు- నేడు పనులు ఏ విధంగా చేస్తున్నారు, ఎన్ని పాఠశాలల పనులు పూర్తి కావచ్చాయి, గ్రామ సచివాలయం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాల భవనాల పనితీరును ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు నిత్యం అందుబాటులో ఉండి మంచి సేవలందించాలని సూచించారు.

Updated Date - 2020-12-27T04:58:46+05:30 IST