మహానందిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2020-12-13T05:59:44+05:30 IST

మహానంది క్షేరత్రాన్ని శనివారం వేలాదిమంది భక్తులు దర్శించుకొన్నారు.

మహానందిలో భక్తుల రద్దీ
మహానంది ఆలయంలో భక్తుల రద్దీ

మహానంది, డిసెంబరు 12: మహానంది క్షేరత్రాన్ని శనివారం వేలాదిమంది భక్తులు దర్శించుకొన్నారు. కార్తీకమాసం పురష్కరిం  చుకొని ఆలయ పరిధిలో ఏర్పాటు చేసిన షవర్ల క్రింద భక్తులు  వేకువజామునే  కార్తీక పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మహిళలు ఆలయం పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెల్లవారుజామున 5గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిరంతర దర్శనం ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాల్లో భక్తుల ఓం నమః శివాయ అనే శివనామస్మరణతో మార్మోగింది. ప్రధాన ఆలయాల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహించి కాయకర్పూరాలు సమర్పించారు. క్షేత్ర పరిసరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కనిపించింది. కాగా కార్తీకమాసం ముగింపు పురష్కరించుకొని ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో దేవస్థానం అఽధికారులు ఏర్పాట్లు చేయనున్నారు వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ. లక్షలాది ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.


 మహానంది శైవ క్షేత్రంలో కార్తీక  మాసం ముగింపును పురష్కరించుకొని ఆదివారం మహానందీశ్వరునికి లక్షబిల్వార్చనను నిర్వహిస్తున్నట్లు ఆలయ వేదపండితుడు రవిశంకర్‌ అవధాని శనివారం తెలిపారు. ప్రధాన గర్భాలయంలో ఉదయం నుంచి స్వామి వారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకంతో పాటు విశేషపూజలను వేదమంత్రాలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం నుంచి లక్ష బిల్వార్చనను ప్రత్యేక రుత్వికులతో శాస్త్రోక్తంగా జరుపుతా మన్నారు. అలాగే 14వ తేదిన కార్తీక అమవాస్య పురష్కరించుకొని సోమవారం నాడు కామేశ్వరీదేవికి ఆలయంలో లక్ష కుంకుమార్చనను జరుపుతామన్నారు. సాయంత్రం 6గంటల నుంచి వందలాది మంది భక్తుల సమక్షంలో మహానందీశ్వరునికి, కామేశ్వరీదేవి అమ్మవార్లకు శాంతి కల్యాణం నిర్వహించడంతో మహానందిలో కార్తీకమాసోత్సవాలు పూర్తవుతాయని వేద పండితుడు తెలిపారు.


Updated Date - 2020-12-13T05:59:44+05:30 IST