గొడ్డలితో దాడి
ABN , First Publish Date - 2020-12-16T05:25:13+05:30 IST
మండలంలోని ఆలమూరు గ్రామంలో వైసీపీ నాయకుడు పత్తి సత్యనారాయణపై అదే గ్రామానికి చెందిన ఉసేన్‌బాషా అలియాస్ బాషా మంగళవారం రాత్రి గొడ్డలితో దాడి చేశాడు.
రుద్రవరం, డిసెంబరు 15: మండలంలోని ఆలమూరు గ్రామంలో వైసీపీ నాయకుడు పత్తి సత్యనారాయణపై అదే గ్రామానికి చెందిన ఉసేన్‌బాషా అలియాస్ బాషా మంగళవారం రాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఇంట్లో పూజ చేసుకుంటుండగా జరిగిన దాడిలో సత్యనారాయణపై గాయపడ్డాడు. బంధువులు ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకుని ఘటన వివరాలపై ఆరా తీశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నిందితుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.