తనిఖీల్లో పట్టుపడ్డ రూ.3.5 లక్షలు.. బిల్లులు చూపించడంతో అప్పగింత

ABN , First Publish Date - 2020-03-15T11:00:40+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భానుముక్కల మలుపులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద శనివారం

తనిఖీల్లో పట్టుపడ్డ రూ.3.5 లక్షలు.. బిల్లులు చూపించడంతో అప్పగింత

పాములపాడు, మార్చి 14: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భానుముక్కల మలుపులో  ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద  శనివారం సాయంత్రం పోలీసుల తనిఖీల్లో లగేజీ ఆటోలో రామకృష్ణ అనే వ్యక్తి వద్ద రూ.3.50లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పట్టుబడ్డ నగదుకు సంబంధించి బిల్లుల పత్రాలను పరిశీలించారు. అనంతరం ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏపీ 21 వీ 6422 అను లగేజీ ఆటోలో కర్నూలుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి తాజ్‌మహల్‌ బీడీ కంపెనీకి చెందిన కలెక్షన్‌ డబ్బులు రూ.3.50లక్షలు వసూలు చేసుకొని వెళ్తుండగా తనిఖీలో పట్టుకున్నామని పేర్కొన్నారు. సదరు నగదుకు చెందిన బిల్లు పత్రాలు తనిఖీ చేయగా సక్రమంగా ఉండటంతో తిరిగి రామకృష్ణకు అప్పగించినట్లు వెల్లడించారు. 


Updated Date - 2020-03-15T11:00:40+05:30 IST