రోడ్డు ప్రమాదంలో లైన్ ఇన్‌స్పెక్టర్ మృతి
ABN , First Publish Date - 2020-12-20T06:06:01+05:30 IST
లూరు సబ్ డివిజన్‌లోని చిప్పగిరి విద్యుత్‌శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఇస్మాయిల్ (55) విధులు ముగించుకొని ఆదోనికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఏ గోనేహాల్ దగ్గర అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆలూరు, డిసెంబరు 19: ఆలూరు సబ్ డివిజన్‌లోని చిప్పగిరి విద్యుత్‌శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఇస్మాయిల్ (55) విధులు ముగించుకొని ఆదోనికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఏ గోనేహాల్ దగ్గర అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.