-
-
Home » Andhra Pradesh » Kurnool » road accident
-
ఎద్దుల బండి, స్కూటర్ ఢీ
ABN , First Publish Date - 2020-11-21T06:18:13+05:30 IST
ఎద్దుల బండిని స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఒకరి మృతి, మరొకరికి గాయాలు
దేవనకొండ, నవంబరు 20 : ఎద్దుల బండిని స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఈదులదేవరబండ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. గుంతకల్ మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సురే్‌ష(35) తోపాటు మరో వ్యక్తి కర్నూలు నుంచి తమ స్వగ్రామమైన నాగసముద్రానికి వెళ్తుండగా దేవనకొండ మండలం ఈదులదేవరబండ సబ్‌స్టేషన్ వద్ద ఎద్దులబండిని స్కూటర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.