బైకును ఢీకొన్న ఎక్స్‌కవేటర్‌

ABN , First Publish Date - 2020-11-06T05:41:54+05:30 IST

మండలంలోని హరినగరం, నరసాపురం గ్రామాల మధ్య ఊటికుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముకుందాపురం గ్రామానికి చెందిన దవనం ఓబులేసు (32) అక్కడికక్కడే మృతి చెందాడు.

బైకును ఢీకొన్న ఎక్స్‌కవేటర్‌
మృతి చెందిన దవనం ఓబులేసు

ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

రుద్రవరం, నవంబరు 5: మండలంలోని హరినగరం, నరసాపురం గ్రామాల మధ్య ఊటికుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముకుందాపురం గ్రామానికి చెందిన దవనం ఓబులేసు (32) అక్కడికక్కడే మృతి చెందాడు. ముకుందాపురం గ్రామం నుంచి భార్య ఆదిలక్ష్మి, సడగుడు ఓబులేసుతో కలిసి బైకుపై ఆళ్లగడ్డ ఆసుపత్రికి వెళ్తుండగా ఎక్స్‌కవేటర్‌ మోటార్‌సైకిల్‌ను దాటే క్రమంలో ఢీకొట్టింది. దవనం ఓబులేసు అక్కడికక్కడే మృతి చెందగా భార్య ఆదిలక్ష్మి, మహానంది మండలం తమడపల్లె గ్రామానికి ఓబులేసు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన ఎక్స్‌కవేటర్‌ ఆలమూరు గ్రామానికి చెందినదిగా గుర్తించామని ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌ దెబ్బతింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దవనం ఓబులేసుకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న భార్య ఆదిలక్ష్మిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-11-06T05:41:54+05:30 IST