అంత్యక్రియలకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..

ABN , First Publish Date - 2020-12-11T05:33:53+05:30 IST

అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది.

అంత్యక్రియలకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..

  1.   బైక్‌ను ఢీకొన్న లారీ


ఎమ్మిగనూరు టౌన్‌, డిసెంబరు 10: అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన  మేరకు.. మంత్రాలయం మండలం సింగరాజనహళ్లి గ్రామానికి చెందిన నిర్మల(35) బూదురు గ్రామంలో బంధువు చనిపోవడంతో ఎమ్మిగనూరుకు వచ్చింది. బస్సులు, ఆటోలు లేకపోవడంతో తెలిసిన వ్యక్తి బైక్‌పై బయల్దేరింది. ఎమ్మిగనూరు మార్కెట్‌ కమిటీ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నిర్మల కాలు తెగి, తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్న ఆమెను, బైక్‌  నడుపుతూ గాయపడిన మధుసూదన్‌ను స్థానికులు 108లో ఎమ్మిగనూరు పభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించగా కోలుకోలేక మృతి చెందింది. 


పెరుగుతున్న ప్రమాదాలు

జాతీయ రహదారిపై ప్రమాదాలు పెరుగు తున్నాయి. ఎమ్మిగనూరులోని తిరుమల సర్కిల్‌, ఓంశాంతి సర్కిల్‌, మార్కెట్‌ సర్కిళ్లలో ఈ ఏడాది ఆరుగురికి పైగా మరణించగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్‌ నియంత్రణ లేకపోవడం, వాహనదారులు ఇష్టారాజ్యంగా వెళ్తుండటమే కారణంగా తెలుస్తోంది. ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-12-11T05:33:53+05:30 IST