బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు

ABN , First Publish Date - 2020-12-31T04:48:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మరో వైపు చేనేతలపై వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు.

బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు
కోట్ల సుజాతమ్మ

ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి  కోట్ల సుజాతమ్మ


ఆలూరు, డిసెంబరు 30: వైసీపీ ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మరో వైపు చేనేతలపై వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 19 నెలల వ్యవధిలో 11 మంది బీసీలను హతమార్చారన్నారు. వైసీపీ ప్రభుత్వ హత్యఖండకు కడప జిల్లాలో జరిగిన నందం సుబ్బయ్య హత్యే నిదర్శనమన్నారు. టీడీపీకి అండగా ఉన్న బీసీలపై కక్షసాధింపుకు వైసీపీ ప్రభుత్వం, నాయకులు పాల్పడుతున్నారన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో దౌర్జన్యాలు, దాడులు అధికమయ్యాయన్నారు. చేనేతలపై వివక్ష చూపుతూ సీఎం నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారన్నారు. ఫ్యాక్షన్‌ మనస్థత్వం వీడి దౌర్జన్యాలకు చరమగీతం పడకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. బీసీలను అనగాదొక్కుతూ, నిరంకుశ విధానాలను అమలు చేయడంలో జగన్‌రెడ్డి హిట్లర్‌ను మించిపోయాడన్నారు. 


  చేనేతలపై ఎందుకంత వివక్ష

ఆదోని: రాష్ట్ర ప్రభుత్వం  బీసీలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని టీడీపీ నాయకులు ప్రతా్‌పరెడ్డి, మాజీ సర్పంచ్‌ లక్ష్మన్న, నాగరాజు, వీరారెడ్డి, వెంకటేశ్‌, తేజా విమర్శించారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కడప జిల్లా పొదుటూరులో సుబ్బయ్య  దారుణ హత్యను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 19 నెలల్లో టీడీపీ సానుభూతిపరులను, నాయకులను హత్య చేయడం ప్రభుత్వ చేతికానితనంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఆటవికపాలన రాజ్యమేలుతోందని, హత్యరాజకీయాలకు ఆంధ్రప్రదేశ్‌ నిదర్శనంగా నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిశ్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తున్న న్యాయవాది, బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేయడం జగన్‌ ఫ్యాక్షన్‌ మనసత్వానికి అద్దం పడుతుందన్నారు. అంతేకాదు చేనేతలపై కూడా ఇటీవల కాలంలో దాడులు అధికమయ్యాయన్నారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్‌ బెట్టింగ్‌లో ఎమ్మెల్యే పాత్రను, ఆయన బావమర్ది పాత్రను బహిర్గతం చేసినందుకు అతి కిరాతకంగా నందం సుబ్బయ్యను హతమార్చారని అన్నారు. సుబ్బయ్య కుటుంబాన్ని ఆదుకొని కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. 




Updated Date - 2020-12-31T04:48:35+05:30 IST