పరిశోధన భూములు కనిపించడం లేదా?

ABN , First Publish Date - 2020-12-11T05:45:05+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూమి విశిష్టత స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకి కనిపిం చడం లేదా? అని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు ప్రశ్నించారు.

పరిశోధన భూములు కనిపించడం లేదా?
కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

నంద్యాల, డిసెంబరు 10: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూమి విశిష్టత స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకి కనిపిం చడం లేదా? అని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు ప్రశ్నించారు. గురువారం ఆర్‌ఏఆర్‌ ఎస్‌ భూములను కాపాడాలని చేస్తున్న ఆందోళనలు 31వ రోజుకు చేరుకున్నాయి. గురువారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కార్యదర్శి ఏవీ రమణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకునేందుకు నెల రోజులుగా కార్మికులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నా ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌, జిల్లా మంత్రులు ఎందుకు స్పందిం చడం లేదని ధ్వజమెత్తారు. ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవికి లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. పరిశోధన భూమిని బీడు భూములుగా చూపెట్టడం దుర్మార్గమన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకునేందుకు ఈనెల 12వ తేదీన శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు కార్యాచరణ రూపొందిస్తాయన్నారు. కార్మిక నాయకులు పుల్లయ్య, మైమున్నీసా, ఖాదర్‌వలి, నాగప్రసాద్‌, సుజాత, ఎల్లమ్మ, ఖాజాబీ, నాగేశ్వరమ్మ, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:45:05+05:30 IST