మద్యం కోసం అద్దె గొడుగు

ABN , First Publish Date - 2020-05-10T09:43:58+05:30 IST

మద్యం కావాలంటే డబ్బు ఒకటి ఉంటే సరిపోదు. ఇది కరోనా కాలం. మూతికి మాస్క్‌ ధరించి, ఆధార్‌ కార్డు చేతిలో పట్టుకుని, భౌతిక ..

మద్యం కోసం అద్దె గొడుగు

పాములపాడు: మద్యం కావాలంటే డబ్బు ఒకటి ఉంటే సరిపోదు. ఇది కరోనా కాలం. మూతికి మాస్క్‌ ధరించి, ఆధార్‌ కార్డు చేతిలో పట్టుకుని, భౌతిక దూరం పాటిస్తూ గొడుగు నీడలో నిలబడిన వారికే మద్యం బాటిల్‌ ఇస్తారు. అయ్యో.. మాస్క్‌, ఆధార్‌ తెచ్చానుగానీ, గొడుగు మరిచిపోయానే.. ఎట్లబ్బా.. అనుకుంటున్నారా..? ‘ఏం పరవాలేదు.. నేనున్నా.. కాకపోతే ఓ రూ.10 ఖర్చు అవుతుంది..’ అని ఓ వ్యక్తి ముందుకొచ్చాడు.


లాక్‌డౌన్‌ వేళ.. పాములపాడు మద్యం దుకాణాల వద్ద గొడుగులను అద్దెకు ఇచ్చే ఉపాధి వెదుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌ సిబ్బంది అద్దె గొడుగులను గుర్తించి మద్యం ఇవ్వకుండా పంపేశారనుకోండీ..! ఆ తరువాత పాములపాడు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. రెడ్‌ జోన్‌ గ్రామాలైన తుమ్మలూరు, మద్దూరు, ఆత్మకూరు నుంచి వచ్చే వారికి మద్యం ఇవ్వకూదని సిబ్బందికి సూచించారు. 

Updated Date - 2020-05-10T09:43:58+05:30 IST