-
-
Home » Andhra Pradesh » Kurnool » release funds to municipal buildings
-
మున్సిపల్ భవనానికి నిధులు కేటాయించండి
ABN , First Publish Date - 2020-12-28T05:28:46+05:30 IST
కర్నూలు నగర పాలక సంస్థ కొత్త భవనానికి నిధులు కేటాయించాలని కమిషనర్ డీకే బాలాజీ డైరెక్టర్ విజయకుమార్‌కు లేఖ రాశారు.

రాష్ట్ర డైరెక్టర్‌ను కోరిన కమిషనర్ డీకే బాలాజీ
కర్నూలు(అర్బన్), డిసెంబరు 27: కర్నూలు నగర పాలక సంస్థ కొత్త భవనానికి నిధులు కేటాయించాలని కమిషనర్ డీకే బాలాజీ డైరెక్టర్ విజయకుమార్‌కు లేఖ రాశారు. 1980లో నిర్మించిన కార్యాలయం శిథిలావస్థకు చేరిందని, తీవ్రమైన వర్షాలు కురిసినప్పుడు పైకప్పు నెర్రలిచ్చి లీకేజీ అవుతోందని అన్నారు. దీంతో ఫైళ్లు తడిసిపోతున్నాయని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ అనుమతి తీసుకున్నామని, హైదరాబాదుకు చెందిన క్షేత్ర స్పేస్ ఫర్ ఆర్కిటెక్ అనే ప్రైవేటు ఏజెన్సీ పూర్తి డ్రాయింగ్స్, సమగ్ర ప్రతిపాదనలతో రూ.28 కోట్ల వ్యయంతో కార్యాలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర మున్సిపల్ శాఖ కర్నూలు నగర పాలక సంస్థకు పుష్కరాల నిర్వహణ కోసం కేటాయించిన రూ.30 కోట్ల నిధుల్లో రూ.12 కోట్లు మిగిల్చామని కమిషనర్ తెలిపారు. ఇంకా అవసరమయ్యే రూ.17 కోట్లను నగర పాలక సంస్థ జనరల్ ఫండ్‌లో ఉన్న సొమ్మును వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు.