సమీప బంధువే అలా చేశాడు

ABN , First Publish Date - 2020-12-27T05:59:54+05:30 IST

కొలిమిగుండ్ల మండలంలోని ఓ గ్రామ పొలాల్లో ఓ బాలికపై సమీప బంధువు అత్యాచారం చేశాడు.

సమీప బంధువే అలా చేశాడు

కొలిమిగుండ్ల, డిసెంబరు 26: కొలిమిగుండ్ల మండలంలోని ఓ గ్రామ పొలాల్లో ఓ బాలికపై సమీప బంధువు అత్యాచారం చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి సమీప బంధువు అమ్మాయిని తీసుకొని ఈ నెల 10న కర్నూలు జిల్లాలో జరిగిన ఓ వివాహానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కొలిమిగుండ్ల మండలంలోని ఓ గ్రామం దాటిన తరువాత సాయంత్రం 4 గంటల సమయంలో కాలువ వెంట కొద్ది దూరం అమ్మాయిని తీసుకెళ్లి ఓ పొలంలో అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే నిన్ను, మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడు. అయితే అమ్మాయి భయంతో ఉండడంతో తల్లి గమనించి ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో కొలిమిగుండ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2020-12-27T05:59:54+05:30 IST