రోడ్డు ప్రమాదంలో మిరప రైతు మృతి

ABN , First Publish Date - 2020-12-11T05:34:50+05:30 IST

మండలంలోని కులుమాల గ్రామానికి చెందిన మిరప రైతు సుబాన్‌(32) కర్నూలు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో మిరప రైతు మృతి

గోనెగండ్ల, డిసెంబరు 10: మండలంలోని కులుమాల గ్రామానికి చెందిన మిరప రైతు సుబాన్‌(32) కర్నూలు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన మేరకు.. సుభాన్‌తో పాట మరో ఆరు మంది రైతులు మిరపను గుంటూరులో విక్రయించేందుకు మినీ లారీలో  బయలు దేరారు. రైతులు లారీపై కూర్చు న్నారు. అయితే బుధవారం రాత్రి కర్నూలు వద్ద వెంకాయపల్లె వద్ద లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో లారీ పైన ఉన్న సుభాన్‌ తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు.  

Updated Date - 2020-12-11T05:34:50+05:30 IST