మొదటి రోజు భక్తులు నిల్‌

ABN , First Publish Date - 2020-11-21T06:14:15+05:30 IST

పుష్కరాలను శుక్రవారం వైసీపీ నాయకులు ప్రదీప్‌రెడ్డి, ఇన్‌చార్జి అధికారి చంద్రశేఖర వర్మ, పాలురు మహాస్వాములు, రౌడకుంద ప్రారంభించారు.

మొదటి రోజు భక్తులు నిల్‌
నిర్మానుష్యంగా ఉన్న మేళిగనూరు పుష్కరఘాట్‌

  1.  స్నానాలు లేకపోవడంతో ఆసక్తి చూపని భక్తులు

కౌతాళం, నవంబరు 20: పుష్కరాలను శుక్రవారం వైసీపీ నాయకులు ప్రదీప్‌రెడ్డి, ఇన్‌చార్జి అధికారి చంద్రశేఖర వర్మ, పాలురు మహాస్వాములు, రౌడకుంద  ప్రారంభించారు. అయితే మొదటి రోజు స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. స్నానాలు ఆచరించకుండా, కంచె నిర్మించడంతో భక్తులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. 


పూర్తికాని రహదారి పనులు: పుష్కరాలు ప్రారంభమైనా, పనులు పూర్తి కాలేదు. దీంతో రహదారులు కోతకు గురై, గతుకులతో కనిపిస్తున్నాయి. నదిచాగి-మేళిగనూరు  వద్ద పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.


నందవరం: నాగలదిన్నె, గురుజాల ఘాట్ల వద్ద భక్తులు మొదటి రోజు అరకొరగా కనిపించారు. దీంతో షవర్ల నుంచి నీరు వృథాగా పోయింది. మధ్యాన్నం ఎమ్మెల్యే తనయుడు జగన్మోహన్‌రెడ్డి వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. శివారెడ్డిగౌడ్‌,  విరుపాక్షి రెడ్డి, నరసింహారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, భీమిరెడ్డి, దత్తప్పగౌడు,  పాల్గొన్నారు.


భక్తుల అసంతృప్తి: స్నానాలకు అనుమతించకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మహిళలు గురుజాల దగ్గర నదిలో స్నానాలు చేసేందుకు   వెళ్లగా పోలీసులు అడ్డుచెప్పడంతో తిరిగి వెనక్కి వచ్చారు.

Updated Date - 2020-11-21T06:14:15+05:30 IST