భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు

ABN , First Publish Date - 2020-11-21T06:11:06+05:30 IST

తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలు చేసేందుకు అనుమతి ఇవ్వకుండా భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
తుంగభద్రనదిలో చీర, సారెను సమర్పిస్తున్న తిక్కారెడ్డి

  1.  మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి

మంత్రాలయం, నవంబరు 20: తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలు చేసేందుకు అనుమతి ఇవ్వకుండా భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం మఠం ఘాట్‌లో పుష్కరస్నానం చేసి పూజలు చేశారు. అనంతరం  విలేఖరులతో మాట్లాడుతూ పుష్కరాల పనులను పూర్తి చేయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. భక్తులకు ఆశిం చిన స్థాయిలో ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాలను మాజీ సీఎం చంద్రబాబు వైభవంగా నిర్వహించా రని గుర్తుచేశారు. ఈసారి నదిలో నీరులేక బురద నీటిలో స్నానాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర నెలల కిత్రం భారీ వర్షాలు కురిసినా, నదికి నీటిని విడుదల చేయించ డంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రోజుకు 20వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కర్నూలుకు సీఎం వస్తున్నారని సుంకేసుల నుంచి నీటిని విడుదల చేయించారని, మరి తుంగభద్ర డ్యాం నుంచి నీటిని ఎందుకు విడుదల చేయించడం లేదని ప్రశ్నించారు. బూదురు లక్ష్మీకాంతరెడ్డి, రమాకాంతరెడ్డి, పన్నగస్వామి, వ్యాసరాజస్వామి, గోపాల్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more