పుష్కర స్నానాలు చేస్తానంటే ఆపొద్దు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-11-22T05:29:35+05:30 IST

పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు నదిలోకి దిగి స్నానాలు చేస్తామంటే ఆపొద్దని ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు.

పుష్కర స్నానాలు చేస్తానంటే ఆపొద్దు: ఎమ్మెల్యే

కర్నూలు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు నదిలోకి దిగి స్నానాలు చేస్తామంటే ఆపొద్దని ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం ఆయన సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఘాట్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులతో, పోలీసులతో  మాట్లాడుతూ పుష్కర స్నానాలు, పిండ ప్రధానాలు చేయాలనుకునే వారి కోసం ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతానికి పైనుంచి నీరు రావడం లేదని త్వరలోనే సమస్యను పరిష్కరించి ఘాట్లలో నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Read more