స్నానాలు లేనప్పుడు పుష్కర ఘాట్లెందుకు?

ABN , First Publish Date - 2020-11-16T04:41:13+05:30 IST

పుష్కర స్నానాలు లేనప్పుడు పుష్కర ఘాట్లు ఎందుకు నిర్మిస్తున్నారని టీడీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ మాజీ దేశాయి మాధవరావు, పార్టీ నాయకుడు ఖాసింవలి ప్రశ్నించారు.

స్నానాలు లేనప్పుడు పుష్కర ఘాట్లెందుకు?
పుష్కరాల పనులను పరిశీలిస్తున్న టీడీపీ బృందం

      1. నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు
      2. పుష్కర పనులను పరిశీలించిన టీడీపీ బృందం


 నందవరం, నవంబరు 15: పుష్కర స్నానాలు లేనప్పుడు పుష్కర ఘాట్లు ఎందుకు నిర్మిస్తున్నారని టీడీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ మాజీ దేశాయి మాధవరావు, పార్టీ నాయకుడు ఖాసింవలి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అది వారం నాగలదిన్నె, గురుజాల గ్రామాల్లో పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. టీడీపీ హయాంలో శివరాత్రికి నెల ముందే ఏర్పాట్లు చేశామని, వైసీపీ ప్రభుత్వం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కేవలం పది రోజల్లో ఘాట్లు ఏర్పాటు చేయడం ఏమిటన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత పాటించడం లేదని ఆరోపించారు. రామలింగేశ్వర గర్బ గుడిని పగులగొట్టడం ఏంటని, పురావస్తు, దేవదాయ శాఖలకు సమాచారం ఇవ్వకుండా ఏలా పగలగొడుతారని ఈవో రమేష్‌తో వాగ్వావాదానికి దిగారు. జగన్‌ పాలనను ప్రజలు అసహ్యించుకుం టున్నారని అన్నారు. ధర్మాపురం గోపాల్‌, బహ్మానందరెడ్డి, టి.ఈరన్న, జబ్బార్‌, రామన్నగౌడ్‌ షరీష్‌, లచ్చప్ప, వెంకటప్ప, ఈరన్న, శీను, వెంకటేష్‌, ఉరుకుందు, శివారెడ్డి, చార్లెష్‌, సోమన్న, శేషు, పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T04:41:13+05:30 IST