పుష్కర పనుల్లో రూ.200 కోట్ల అవినీతి

ABN , First Publish Date - 2020-12-01T06:10:39+05:30 IST

పుష్కర పనుల్లో రూ.200 కోట్ల అవినీతి జరిగిం దని మంత్రాలయ టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి ఆరోపించారు.

పుష్కర పనుల్లో రూ.200 కోట్ల అవినీతి

  1.  మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి 


కోసిగి, నవంబరు 30: పుష్కర పనుల్లో రూ.200 కోట్ల అవినీతి జరిగిం దని మంత్రాలయ టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి ఆరోపించారు. సోమవా రం మండలంలోని కుంభలనూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభు త్వం రూ.260 కోట్లు మంజూరు చేస్తే, కేవలం రూ.60 కోట్లతోనే పనులు చేశా రన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగి పోయాయనీ, సామాన్యులు అల్లాడిపోతున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలు పూర్తికావచ్చినా  ఇప్పటి వరకు ఘాట్లలో పనులు చేస్తున్నారన్నారు. భక్తులు స్నానాలు చేయకుండా చేశారని హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యంగా కనిపి స్తోందని తిక్కారెడ్డి అన్నారు. కౌతాళం మండలం మెళిగనూరు రామలిం గేశ్వరస్వామి పుష్కర ఘాట్‌లో తిక్కారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి,  మెళిగనూరులో పుష్కరఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌ నాయుడు, చెన్నబసప్ప, అడివప్ప గౌడు, సుదీర్‌ రెడ్డి, కోట్రేష్‌ గౌడు, నీలకంఠారెడ్డి, రామలింగ, సిద్దప్ప, కురువ వీరేష్‌, రమేష్‌గౌడ్‌ మల్లయ్య, పన్నాగ వెంకటేష్‌ స్వామి, కోసిగి టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్‌ ముత్తు రెడ్డి, నాడిగేని అయ్యన్న, చింతలగేని నర్సిరెడ్డి, సల్మాన్‌ రాజ్‌, జ్ఞానేష్‌, బొంపల్లి నరసింహులు, మాలపల్లి వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:10:39+05:30 IST