పత్తి క్వింటం రూ.5,489

ABN , First Publish Date - 2020-12-13T05:59:54+05:30 IST

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు స్వల్పంగా పుంజుకు న్నాయి.

పత్తి క్వింటం రూ.5,489

  1. స్వల్పంగా పెరిగిన ధర 


ఆదోని(అగ్రికల్చర్‌), డిసెంబరు 12: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు స్వల్పంగా పుంజుకు న్నాయి. గత వారంతో పోల్చితే రూ.150 పెరిగి,  శనివారం గరిష్టంగా క్వింటం రూ.5,489 పలి కింది. ధరలు పెరుగు తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు పెరగడంతో పోటీ పెరిగి  ధరలు పెరిగాయని తెలుస్తోంది. శనివారం 7,331 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ఠంగా రూ.3,466, గరిష్ఠంగా రూ.5489 పలికింది. 

Updated Date - 2020-12-13T05:59:54+05:30 IST