జనవరి 17న పోలియో చుక్కలు

ABN , First Publish Date - 2020-12-29T05:28:39+05:30 IST

వచ్చే ఏడాది జనవరి 17న 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

జనవరి 17న పోలియో చుక్కలు

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 28: వచ్చే ఏడాది జనవరి 17న 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు 5.26 లక్షల మంది ఉన్నారన్నారు. జిల్లాకు 6.20 లక్షల డోసులు వస్తాయన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి పల్స్‌ పోలియో కేంద్రంలో సిబ్బంది శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

Updated Date - 2020-12-29T05:28:39+05:30 IST