మురిసిన మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2020-08-16T11:52:28+05:30 IST

ఆదోని పట్టణంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా శనివారం ఘనంగా జరుపుకున్నారు.

మురిసిన మువ్వన్నెల జెండా

 ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం 


ఆదోని/ఆదోని(అగ్రికల్చర్‌), ఆగస్టు 15: ఆదోని పట్టణంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రామకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఏవో పెద్దయ్య, డీటీ రజినికాంత్‌రెడ్డి, వలిబాషా, ఆర్‌ఐ పెద్దయ్య పాల్గొన్నారు. 


టీడీపీ కార్యాలయంలో.. టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర నాయకుడు భూపాల్‌చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  కార్యక్రమంలో బుద్దారెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకటేశ్‌, రామాంజి, తిమ్మప్ప, బాలాజీ, శ్రీనివాసచారి, సజ్జాద్‌ పాల్గొన్నారు. 


టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ శ్రీరాములు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ రమే్‌షబాబు, తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో సీఐ పార్థసారథి, ఎస్‌ఐ రామాంజులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో గీతావాణి, ఎంఈవో శివరాములు జెండా ఆవిష్కరించారు. 


ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున, నెహ్రూమెమోరియల్‌ స్కూల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అలీంసిద్ధికి, మండగిరి ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గౌస్‌, అర్ధగేరి బసవన్నగౌడ్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున, ఆర్ట్స్‌ కళాశాలలో కళాశాల చైర్మన్‌  విట్టాకిష్టప్ప, మిల్టన్‌ గ్రామర్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో సివిల్‌ ర్యాంకర్‌ సమీర్‌రాజా జాతీయ జెండాను ఎగరవేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో చైర్మన్‌ మహబూబ్‌బాషా జెండాను ఆవిష్కరించారు. ఆర్‌ఆర్‌లేబర్‌ కాలనీ ఉన్నతపాఠశాలలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ నకలరాజు జెండా ఎగరవేశారు. నేషనల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో పాఠశాల అధినేత గోపాల్‌రెడ్డి, అక్షరశ్రీ పాఠశాలలో డైరెక్టర్‌ మేఘనాథ్‌రెడ్డి  జెండాను ఎగరవేశారు. చిన్మయ పాఠశాలలో కరస్పాండెంట్‌ దైవదీనంరెడ్డి, సాయి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ జనార్ధన్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మదిరె గ్రామానికి చెందిన వృద్ధురాలు లింగమ్మ చేత జెండాను ఎగరవేశారు. 


ఆదోని టౌన్‌: ఆదోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


భార్‌పేటలోని ఉర్దూఘర్‌లో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పతాకావిష్కరణ చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ సుబ్బారావు, ఆదోని ఏరియా ఆసుపత్రిలోని క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పతాకాన్ని ఆవిష్కరించారు.  కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సీనియర్‌ మాజీ కౌన్సిలర్‌ దిలీ్‌పధోకా, విశ్వహిందూపరిషత్‌ కార్యాలయంలో జంగం బసవరాజు పతాకావిష్కరణ చేశారు. 


ఆలూరు: ఆలూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో జడ్జి జ్యోతి, పోలీస్‌ స్టేషన్‌లో సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు, మార్కెట్‌ యార్డులో చైర్మన్‌ హరిపుష్పావతి, సచివాలయంలో వైసీపీ ఇన్‌చార్జి నారాయణస్వామి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ హుసేన్‌సాబ్‌, ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో ఏఎ్‌సడబ్ల్యువో జాకీర్‌హుసేన్‌,  ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అల్లాబకాష్‌, విద్యుత్‌ శాఖ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నాగేంద్ర,  మోడల్‌ స్కూల్‌లో ఎస్‌ఎంసీ చైర్మన్‌ హనుమయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. ఆలూరు మండలంలోని హత్తిబెళగల్‌ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని రైతులు, రైతు కూలీలతో కలిసి సామాజిక కార్యకర్త కమలాకర్‌నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. 

 

చిప్పగిరిలో.. మండలంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం, కస్తూర్బా పాఠశాల, జడ్పీహెచ్‌ఎ్‌స స్కూల్‌, గ్రామ సచివాలయం వద్ద జెండా ఆవిష్కరించారు.


ఆస్పరి: ఐకేపీ కార్యాలయంలో మండల సమాక్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, పోలీస్‌ స్టేషన్‌లో  ఎస్‌ఐ నాగేంద్ర, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నిత్యానందరాజు, సొసైటీ కార్యాలయంలో చైర్మన్‌ కేశవరెడ్డి, ప్రాథమిక పాఠశాలలో విద్యాకమిటీ చైర్మన్‌ గోవిందరాజులు జాతీయ జెండాను ఎగరవేశారు. 


దేవనకొండ: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, సచివాలయల్లో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. దేవనకొండలోని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో సీపీఐ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు.


అవుకు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చల్లా భవన్‌ వద్ద ఎమ్మెల్సీ చల్లా రామక్రిష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగువేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, విద్యుత్‌ కార్యాలయంలో ఏఈ పక్కీరయ్య, సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు తిరుపాలయ్య, ఎల్లా రాముడు, చిన్న మద్దిలేటి, మేజర్‌ పంచాయతీ కార్యాలయంలో ఈవోఆర్డీ బాలాంజినేయులు జెండా ఎగుర వేశారు. 


బనగానపల్ల్లె: బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నాగప్రసాద్‌, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దార్‌ ఆల్‌ఫ్రెడ్‌, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో సతీష్‌ కుమార్‌ రెడ్డి, సర్కిల్‌ కార్యాలయంలో సీఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ కృష్ణమూర్తి, మహేష్‌ కుమార్‌, బనగానపల్లె మార్కెట్‌యార్డులో చైర్మన్‌ దీవెనమ్మ, సెక్రటరీ శ్రీనివాసులు, నెహ్రూ ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్లు కోడూరు హరినాథ్‌రెడ్డి, హెచ్‌ఎం కమల్‌ తేజారెడ్డి, కార్పెంటర్‌ కార్యాలయంలో అధ్యక్షుడు చాంద్‌బాషా, సెక్రటరీ మహ్మద్‌హుస్సేన్‌, పశువైద్యశాలలో ఏడీ వెంకటరమణ, విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈవో స్వరూప, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ శంకర్‌నాయక్‌, డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ స్వర్ణలత, ఆయుర్వేద వైద్యశాల లో డాక్టర్‌ పద్మనాభరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో డీఈ ఉమాకాంత్‌రెడ్డి, ఆర్టీసీ డిపోలో మేనేజరు శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగుర వేశారు. 


కోవెలకుంట్ల: పట్టణంలోని సీఐ కార్యాలయంలో సీఐ సుబ్బరాయుడు, మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీసీఆర్‌ సూర్యనారాయణరెడ్డి, మార్కెట్‌ యార్డులో చైర్మన్‌ బీవీ నాగార్జునరెడ్డి, ఎక్సైజ్‌ కార్యాలయంలో సీఐ వరలక్ష్మి, కోవెలకుంట్ల ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ కళ్యాణ్‌ కుమార్‌, కోర్టు ఆవరణలో జడ్జి రాకేష్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహబూబ్‌ దౌలా, హౌసింగ్‌ కార్యాల యంలో ఏఈ వెంకటేశ్వర్లు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, వెలుగు కార్యాలయంలో ఏపీఎం బాబు, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జనార్దన్‌శెట్టి, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ కళ్యాణ్‌ కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో డీఈ ఏడుకొండలు, ఆర్‌అండ్‌ బీ కార్యాలయంలో డీఈ సుధాకర్‌, ట్రెజరీ కార్యాలయంలో ఎస్‌టీవో సురేష్‌, రేవనూరు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సత్యనారాయణ, ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవో ఆగ్నేస్‌ ఏంజిల్‌, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, స్వాతంత్య్ర సమర యోధుడు వల్లవర పు అంకిరెడ్డి స్మారక ప్రాంగణాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు సీతా రామయ్య, బనగానపల్లె నియోజక వర్గ కన్వీనర్‌ బిజ్జిగాళ్ల లింగన్న జెండాను ఆవిష్కరించారు. 


సంజామల:  తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నాగ కుమార్‌, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ తిమ్మారెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యకమిటీ చైర్మన్‌ ఎర్రన్న, సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గోపీనాథ్‌, మెయిన్‌ స్కూల్లో హెచ్‌ఎం ఆదిశేషగిరిరావు, ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, గిద్దలూరు ఉన్నత పాఠశాలలో విద్యాకమిటీ చైర్మన్‌ రవికాంత్‌రెడ్డి, ముక్కమళ్ల యూపీ పాఠశాలలో హెచ్‌ఎం నాగరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. ముక్కమళ్ల పాఠశాలలో దాత శ్రీనివాసరెడ్డి ముగ్గురు విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.5వేలు ప్రోత్సాహక బహుమతి అందించారు.


నందికొట్కూరు: పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం లో మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్థర్‌, కమిషనర్‌ అంకిరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగురవేశారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి శ్రీవిద్య, తహసీ ల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ రూపలత జెండాను ఎగురవేశారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీడీవో క్యాథరిన్‌, ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌లో సీఐ నాగసునీతారాణి, సర్కిల్‌ పోలీసు స్టేషన్‌లో సీఐ నాగరాజారావు, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏడీఏ వీరారెడ్డి జాతీయ జెండాను ఎగువేశారు. 


నందికొట్కూరు రూరల్‌: మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ రూపలత శనివారం జాతీ య జెండాను ఎగురవేశారు. మండల పరిషత్‌ కార్యాలయం, రూరల్‌ సీఐ కార్యాలయం, ఎక్సైజ్‌ సీఐ కార్యాలయం, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, వివిధ కార్యాలయాల ఎదుట జాతీయ జెండాను ఎగురవేశారు. 


జూపాడుబంగ్లా: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శోభారాణి, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ నరసింహారావు, పీహెచ్‌సీ వద్ద వైద్యాధికారి శ్రీధర్‌రెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. 


మిడుతూరు: తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ అరుణ కుమారి జాతీయ జెండా ఎగురవేశారు. ఎస్‌ఐ గోపీనాత్‌, పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. 


పగిడ్యాల: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో గౌరీదే వి, తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ కళావతి, ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాసులు, ఆదర్శ పాఠశాలల్లో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, గ్రామా సచివాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగురవేశారు.


పాములపాడు: తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాజేశ్వరి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఏవో కరుణసాగర్‌, గ్రంథాలయంలో లైబ్రేరియన్‌ హనుమే నాయక్‌, కేజీబీవీలో రాజ్యలక్ష్మి, వ్యవసాయ కార్యాలయంలో ఏవో ఫణీశ్వరరెడ్డి, వేంపెంట హైస్కూల్‌లో పాఠశాల కమిటీ చైర్మన్‌ రఘు నాయక్‌, హెచ్‌ఎం రవీంద్రుడు, వివేకనాంద హైస్కూల్‌లో ఆర్‌ఎస్సార్‌ గోపాల్‌, డి.నారాయణరెడ్డి డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్‌ నారాయణరెడ్డి, ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ షేక్షావలి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 


కొత్తపల్లి: కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో కార్యాలయాల్లో  ఎంపీడీవో చంద్రశేఖర్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ నవీన్‌బాబు, ఎమ్మార్సీ భవన్‌లో ఎంఈవో శ్రీరాములు,  కొత్తపల్లి, ఎర్రమఠం, గోకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయా పీహెచ్‌సీల వైద్యులు జెండా ఎగురవేశారు. అలాగే వీరాపురం గ్రామంలో భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు స్వామిదాసు గారి లింగస్వామి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. 


పత్తికొండ/టౌన్‌: పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం లో తహసీల్దార్‌ శ్రీదేవి, మండల పరిషత్‌ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎంపీడీవో పార్ధసారథి, పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆదినారాయణరెడ్డి, కోర్టు ప్రాంగణంలో కోర్టు సూపరింటెండెంట్‌ దివాకర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ కృపేంద్రనాథ్‌ రెడ్డి, సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య జాతీయ జెండాను ఎగుర వేశారు. పత్తికొండ టీడీపీ కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్మన్‌ బత్తిన వెంకట రాము డు జెండా ఎగురవేశారు. నాయకులు మనోహర్‌చౌదరి, రామానాయుడు, అశోక్‌ కుమార్‌, కొమ్ము వెంకటేష్‌, వెంకటపతి, సోమ్లా నాయక్‌, చెన్నమనాయుడు, కడవల సుధాకర్‌, హరినాథ్‌గౌడ్‌, రవీంద్ర, సత్య, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. 


మద్దికెర: తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీ ల్దార్‌ నాగ భూషణం, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నరసింహ మూర్తి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మస్తాన్‌వలి, సహకార సంఘంలో చైర్‌ పర్సన్‌ సర్కార్‌ వెంకటరాముడు, జడ్పీ బాలుర పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్‌ గడ్డం బాలచంద్ర, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో జెండాను ఎగురవేశారు. 


తుగ్గలి: ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పత్తికొండ రూరల్‌ సీఐ నారాయణరెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో వీరరాజు, డిప్యూటీ తహసీల్దార్‌ నిజాం ఉద్దీన్‌, ఎస్‌ఐలు రమేష్‌ బాబు, సురేష్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు అట్లా గోపాల్‌రెడ్డి, ప్రహ్లాదరెడ్డి అన్నారు. శనివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో, పాఠశాలల్లో జెండా ఆవిష్కరించారు. 


క్రిష్ణగిరి: తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రామ చంద్రారావు, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో స్వర్ణలత, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి జెండాను ఎగురవేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలలో జెండాను ఎగురవేశారు.


వెల్దుర్తి:  గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఏవో రవి ప్రకాష్‌, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి  జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.


ఎమ్మిగనూరు టౌన్‌: 74వ స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా శనివారం మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు.  మున్సిఫ్‌ మేజిస్ర్టేట్‌ కోర్టులో జడ్జి శ్రీకాంత్‌ త్రివర్ణపతాకాన్ని ఎగురువేశారు. పట్టణ పోలీస్‌స్టేషనల్‌లో సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు ప్రసాద్‌, వెంకటరాముడు, రూరల్‌ సీఐ మహేశ్వరరెడ్డి, ఫైర్‌స్టేషన్‌లో ఫైర్‌ ఆఫీసర్‌ మోహన్‌బాబు జెండాను ఎగురవేశారు. జనసేన కార్యాలయంలో  రేఖగౌడ్‌ జెండా ఎగురవేశారు. పెన్షనర్ల సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు ఏపీ వీరన్న జెండాను ఎగురవేశారు.  ఆర్‌ఆండ్‌బీ ఏఈ, ఎస్‌బీఐలో మేనేజర్‌ జాతీయజండాను ఎగురువేశారు. టౌన్‌బ్యాంకులో వైసీపీ నాయకులు జగన్మోహన్‌డ్డి జెండాను ఎగురవేశారు. 


నందవరం: ఎంపీడీవో ఫజుల్‌బాషా, కృష్ణమూర్తి, తహసీల్దార్‌  నాగరాజు,  ఎస్‌ఐ నాగరాజు, ఆసుపత్రిలో డాక్టర్‌ నిర్మల, పశవైద్యశాలలో డాక్టర్‌ బన్ని హేమంత్‌కుమార్‌, పూలచింతలో టీడీపీ నాయకులు బండేగురుస్వామి, గౌరిశంకర్‌, రాజశేఖర్‌స్వామి, ముగతిలో కేడీసీసబీ డైరెక్టర్‌ విరుపాక్షిరెడ్డి, రాఘవరెడ్డి, తారకరాముడు, కార్యదర్శి రామకృష్ణ వేడుకలు జరుపుకున్నారు.


గోనెగండ్ల: ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ నసూరుద్ధీన్‌, పంచాయతీ కార్యాలయంలో ఈవో రంగ నాయకులు, తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ పురు షోత్తముడు,  ఎస్‌ఐ హనుమంతరెడ్డి, ఆసుపత్రిలో డాక్టర్‌ గియాజ్‌బేగం, లైబ్రేరియన్‌ వెంకటేశ్వర్లు జెండా ఎగుర వేశారు. 

 

కౌతాళం: తహసీల్దార్‌ చంద్రశేఖర వర్మ జెండా వందనం నిర్వహించారు. ఎస్‌ఐ నాగార్జున రెడ్డి, ఎంపీడీఓ సూర్యనారాయణ జెండా వందనం నిర్వహించారు. 


మంత్రాలయం: రాఘవేంద్రనగర్‌లో గ్రంథాలయ అధికారి శివరాం ప్రసాద్‌, మంత్రాలయం, మాధవరం పోలీస్‌స్టేషన్‌లో సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు వేణుగోపాల్‌రాజు, ఎర్రన్న, బాబు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, జడ్పీ ఉన్నత పాఠశాల్లో ఇన్‌చార్జి హెచ్‌ఎం తిమ్మప్ప జెండా ఎగురవేశారు.


కోసిగి: తహసీల్దార్‌ రుద్రగౌడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో వైసీపీ  ఇన్‌చార్జి మురళిరెడ్డి, పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ ఈశ్వరయ్య, మార్కెట్‌ యార్డులో చైర్మన్‌, సింగిల్‌ విండో కార్యాలయంలో మహంతేష్‌ స్వామి, కోసిగి పోలీస్‌స్టేషన్‌లొ ఎస్‌ఐ ధనుంజయ్‌, బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఇన్‌చార్జి పురుషోత్తం రెడ్డి, వెలుగు కార్యాలయంలో ఏపీఎం సత్తెన్న, ఎస్‌బీఐ బ్యాంక్‌ కార్యాలయంలో మేనేజర్‌ రాజేష్‌, బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలో నరసింహులు, ఈరన్న జెండాను ఎగురవేశారు. 

Updated Date - 2020-08-16T11:52:28+05:30 IST